Telugu Global
Cinema & Entertainment

"ఆర్.ఆర్.ఆర్" కోసం తన పని మొదలుపెట్టిన కీరవాణి

ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్న సినిమా “ఆర్.ఆర్.ఆర్”. షూటింగ్ మొదలు పెట్టుకొని ఇప్పటికే మొదటి షెడ్యూల్ ని గ్రాండ్ గా పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం రెండవ షెడ్యూల్ తో బిజీగా ఉంది. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమాకి సంబంధించిన రెండో షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. అయితే ఈ షూటింగ్ లోనే ఎం.ఎం. కీరవాణి ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేసాడట. రాజమౌళి […]

ఆర్.ఆర్.ఆర్ కోసం తన పని మొదలుపెట్టిన కీరవాణి
X

ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్న సినిమా “ఆర్.ఆర్.ఆర్”. షూటింగ్ మొదలు పెట్టుకొని ఇప్పటికే మొదటి షెడ్యూల్ ని గ్రాండ్ గా పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం రెండవ షెడ్యూల్ తో బిజీగా ఉంది.

హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమాకి సంబంధించిన రెండో షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. అయితే ఈ షూటింగ్ లోనే ఎం.ఎం. కీరవాణి ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేసాడట. రాజమౌళి బిజీ షెడ్యూల్ లో ఉండటంతో సినిమా షూటింగ్ స్పాట్ లోనే కీరవాణి మ్యూజిక్ సిట్టింగ్స్ చేస్తున్నాడట.

ఇప్పటికే రెండు పాటలని రాజమౌళి లాక్ చేసినట్టు కూడా తెలుస్తోంది. రామ్ చరణ్ పోలీస్ గా నటిస్తున్న ఈ సినిమా ఎన్టీఆర్ దొంగగా నటిస్తున్నాడనే టాక్ ఉంది.

ఇంకా హీరోయిన్స్ ఫిక్స్ కానీ ఈ సినిమాకోసం హీరోయిన్స్ ని వెతికే వేటలో రాజమౌళి బిజీగా ఉన్నాడు. డి.వి.వి ఎంటర్ టైన్ మెంట్స్ పై డి.వి.వి దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

First Published:  9 March 2019 2:01 AM GMT
Next Story