Telugu Global
Cinema & Entertainment

చిరంజీవి కోసం మరో నిర్మాతని సెట్ చేసిన రామ్ చరణ్

రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ పై మెగా స్టార్ హీరోగా “సై రా నరసింహారెడ్డి” సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ కానుంది. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తరువాత చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యడానికి ఓకే చెప్పాడు. సమ్మర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే […]

చిరంజీవి కోసం మరో నిర్మాతని సెట్ చేసిన రామ్ చరణ్
X

రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ పై మెగా స్టార్ హీరోగా “సై రా నరసింహారెడ్డి” సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ కానుంది. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక ఈ సినిమా తరువాత చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యడానికి ఓకే చెప్పాడు. సమ్మర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమాకి తన స్నేహితుడైన మిక్కిలినేని సుధాకర్ బ్యానర్ లో చేయాలని కొరటాల రామ్ చరణ్ ని అడిగాడట. ఎప్పటి నుంచో సుధాకర్ ను వెయిటింగ్ చేయిస్తున్నానని, అందుకే అతనితో ఈ సినిమా చేస్తానని చరణ్ ని అడిగాడట కొరటాల.

అయితే ఈ సినిమా కొణిదెల ప్రొడక్షన్స్ లో తీయాలని చరణ్ ఫిక్స్ అయిపోయాడు. అయితే ఈ ప్రాజెక్ట్ లో సుధాకర్ ని కూడా భాగస్వామిగా చేర్చుకోవడానికి రామ్ చరణ్ ఓకే చెప్పాడట. కానీ బిజినెస్ వ్యవహారాలు అన్ని రామ్ చరణ్ చూసుకుంటాడట. మొత్తానికి ఆ విధంగా కొరటాల మాటను కాదనలేక…. మరో నిర్మాతకి కూడా చిరంజీవితో సినిమా చేసే అవకాశం ఇచ్చాడు రామ్ చరణ్.

First Published:  8 March 2019 10:58 PM GMT
Next Story