Telugu Global
Cinema & Entertainment

తమన్నా లీడ్ రోల్ లో "రాజు గారి గది 3" ?

తెలుగు ఇండస్ట్రీ లో హారర్ కామెడీ సినిమాలు రాజ్యం ఏలుతున్న టైం లో టీవి నటుడు అయిన ఓంకార్ దర్శకుడిగా మారి “రాజు గారి గది” అనే హారర్ కామెడీ ని డైరెక్ట్ చేసి హిట్ అందుకున్నాడు. ఆ సినిమా తరువాత మళ్ళీ దాదాపు ఏడాది గ్యాప్ తీసుకొని “రాజు గారి గది” సినిమాకి సీక్వెల్ గా “రాజు గారి గది 2” అనే సినిమాని డైరెక్ట్ చేసాడు. ఈ సినిమాలో అక్కినేని సమంతా, అక్కినేని నాగార్జున […]

తమన్నా లీడ్ రోల్ లో రాజు గారి గది 3 ?
X

తెలుగు ఇండస్ట్రీ లో హారర్ కామెడీ సినిమాలు రాజ్యం ఏలుతున్న టైం లో టీవి నటుడు అయిన ఓంకార్ దర్శకుడిగా మారి “రాజు గారి గది” అనే హారర్ కామెడీ ని డైరెక్ట్ చేసి హిట్ అందుకున్నాడు.

ఆ సినిమా తరువాత మళ్ళీ దాదాపు ఏడాది గ్యాప్ తీసుకొని “రాజు గారి గది” సినిమాకి సీక్వెల్ గా “రాజు గారి గది 2” అనే సినిమాని డైరెక్ట్ చేసాడు. ఈ సినిమాలో అక్కినేని సమంతా, అక్కినేని నాగార్జున లని లీడ్స్ గా పెట్టుకొని కొంచెం పెద్ద సినిమాలాగే తీసి మరోసారి హిట్ అందుకున్నాడు.

ఇక ఇప్పుడు “రాజు గారి గది 3” కి కథ రెడీ చేశాడట ఓంకార్. ఈ మూడో భాగం కోసం హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నని అనుకున్నాడట ఓంకార్.

ఇటీవలే ముంబై వెళ్లి తమన్నా ని కలిసి కథ కూడా వినిపించి వచ్చాడట ఓంకార్. తమన్నా కూడా ఎప్పుడు ఇటువంటి పాత్రలో నటించకపోవడంతో ఈ కథకి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఓంకార్ ఈ సినిమా కథనం పై వర్క్ చేస్తున్నాడు.

First Published:  8 March 2019 2:18 AM GMT
Next Story