Telugu Global
Cinema & Entertainment

ఒక్క సినిమాకి రెండు క్లైమాక్స్ లు ?

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం “జెర్సీ” సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. “మళ్ళీ రావా” ఫేం గౌతం తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పూర్తి స్థాయి ఎమోషనల్ సినిమా గా తెరకెక్కుతుంది. క్రికెట్ నేపధ్యంలో సాగబోయే ఈ కథలో నాని అర్జున్ అనే క్రికెటర్ పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో నాని పాత్రకి చాలా ఎమోషన్స్ ఉంటాయట. అందుకే కథ పరంగా ఈ సినిమాని విషాదంతో ఎండ్ చేద్దాం అని డైరెక్టర్ అనుకున్నాడట. […]

ఒక్క సినిమాకి రెండు క్లైమాక్స్ లు ?
X

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం “జెర్సీ” సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. “మళ్ళీ రావా” ఫేం గౌతం తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పూర్తి స్థాయి ఎమోషనల్ సినిమా గా తెరకెక్కుతుంది.

క్రికెట్ నేపధ్యంలో సాగబోయే ఈ కథలో నాని అర్జున్ అనే క్రికెటర్ పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో నాని పాత్రకి చాలా ఎమోషన్స్ ఉంటాయట. అందుకే కథ పరంగా ఈ సినిమాని విషాదంతో ఎండ్ చేద్దాం అని డైరెక్టర్ అనుకున్నాడట.

గతంలో ఇలా విషాదం ఎండ్ తో వచ్చిన సినిమాల రిజల్ట్ ను దృష్టిలో ఉంచుకుని…. ఈ సినిమాకి రెండు క్లైమాక్స్ లు సెట్ చేశాడట గౌతం. హ్యాపీ ఎండింగ్ తో ఒక సీక్వెన్స్ ప్లాన్ చేసాడట. ఒకవేళ ఇదే గాని నిజం అయితే నాని “జెర్సీ” సినిమా పరంగా ఒక పెద్ద ప్రయోగం చేసినవాడే అవుతాడు.

శ్రద్ధ శ్రీనాద్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది.

First Published:  8 March 2019 12:08 AM GMT
Next Story