Telugu Global
International

అభినందన్‌పై కేసు పెట్టిన పాకిస్తాన్.... ఇంతకూ ఎందుకో తెలుసా..?

పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఐఏఎఫ్‌కు చెందిన విమానాలు ఆజాద్ కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాయి. ఆ తర్వాత రోజు ప్రతిగా పాకిస్తాన్ వైమానిక దళం ఎఫ్-16తో భారత్ వైపు చొచ్చుకొని వచ్చాయి. అదే సమయంలో వింగ్ కమాండర్ అభినందన్ తన మిగ్-21 సహాయంతో ఎఫ్-16ని కూల్చేశాడు. అదే సమయంలో పాక్ భూతలంపైన కూడా దాడులు చేశాడు. ఇక అభినందన్ పాక్‌ చెరలో ఉండటం.. […]

అభినందన్‌పై కేసు పెట్టిన పాకిస్తాన్.... ఇంతకూ ఎందుకో తెలుసా..?
X

పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఐఏఎఫ్‌కు చెందిన విమానాలు ఆజాద్ కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాయి. ఆ తర్వాత రోజు ప్రతిగా పాకిస్తాన్ వైమానిక దళం ఎఫ్-16తో భారత్ వైపు చొచ్చుకొని వచ్చాయి. అదే సమయంలో వింగ్ కమాండర్ అభినందన్ తన మిగ్-21 సహాయంతో ఎఫ్-16ని కూల్చేశాడు. అదే సమయంలో పాక్ భూతలంపైన కూడా దాడులు చేశాడు.

ఇక అభినందన్ పాక్‌ చెరలో ఉండటం.. తర్వాత విడుదల చేయడం ప్రపంచానికి తెలిసిందే. ఆ తర్వాత కూడా పాకిస్తాన్ భారత్‌పై కవ్వింపు చర్యలు ఆపలేదు. మరో వైపు తమ భూభాగంలో ఎలాంటి దాడులు జరగలేదని బుకాయిస్తూ వస్తోంది. కేవలం ఖాళీ ప్రదేశాల్లో బాంబులు వేసి వెళ్లారని నమ్మిస్తోంది.

పాకిస్తాన్ వ్యాఖ్యలకు బలం చేకూర్చుకునేలా ఓ వింత చర్యకు పాల్పడింది. తమ భూభాగంలోనికి చొచ్చుకొని వచ్చిన భారత వింగ్ కమాండర్ దాడిలో అనేక చెట్లు కూలిపోయాయని కేసు పెట్టారు. అది కూడా పాకిస్తాన్ అటవీ శాఖ ఈ కేసు నమోదు చేసింది. తమకు ఎలాంటి దాడి జరగలేదని.. నష్టం కూడా లేదని.. ఆర్మీకి దీంతో సంబంధం లేదన్నట్లుగా బిల్డప్ ఇవ్వడానికే ఇలా అటవీ చట్టాల కింద కేసు వేసింది.

తద్వారా మేం కొన్ని చెట్లు మాత్రమే కోల్పోయాం అనే సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలని ప్రయత్నించింది. అటవీశాఖ పిర్యాదును అనుసరించి పాకిస్తాన్ ప్రభుత్వం పర్యావరణ నష్టంపై ఐక్యరాజ్య సమితిలో పిర్యాదు చేయనున్నట్లు పాక్ మీడియా తెలిపింది.

First Published:  8 March 2019 5:30 AM GMT
Next Story