Telugu Global
Cinema & Entertainment

మంచి ధరకి అమ్ముడుపోయిన "మజిలీ" శాటిలైట్ రైట్స్

దాదాపు చాలా కాలం తరువాత అక్కినేని నాగ చైతన్య, అక్కినేని సమంతా కలిసి నటిస్తున్న సినిమా “మజిలి”. పెళ్లి తరువాత వీళ్ళిద్దరూ కలిసి నటిస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమా పై అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఈ సినిమాలో వీళ్ళిద్దరూ భార్య భర్తలుగానే నటిస్తున్నారు. ఇక ఇటీవలే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 5 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. “నిన్ను కోరి” ఫేం శివ […]

మంచి ధరకి అమ్ముడుపోయిన మజిలీ శాటిలైట్ రైట్స్
X

దాదాపు చాలా కాలం తరువాత అక్కినేని నాగ చైతన్య, అక్కినేని సమంతా కలిసి నటిస్తున్న సినిమా “మజిలి”. పెళ్లి తరువాత వీళ్ళిద్దరూ కలిసి నటిస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమా పై అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.

అలాగే ఈ సినిమాలో వీళ్ళిద్దరూ భార్య భర్తలుగానే నటిస్తున్నారు. ఇక ఇటీవలే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 5 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది.

“నిన్ను కోరి” ఫేం శివ నిర్వాన ఈ సినిమాని కూడా పూర్తి స్థాయి లవ్ స్టొరీ గా తెరకెక్కించాడు అని టిజర్ చూస్తే అర్ధం అవుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా యొక్క శాటిలైట్ రైట్స్ ని ప్రముఖ టీవి ఛానల్ అయిన జెమినీ దాదాపు అయిదు కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది.

దీన్ని బట్టి చూస్తుంటే సినిమా పై బయట డిస్ట్రిబ్యూటర్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయని అర్ధం అవుతుంది. ముంబై మోడల్ అయిన దివ్యన్ష కూడా ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటిస్తుంది. షైన్ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

First Published:  7 March 2019 1:41 AM GMT
Next Story