Telugu Global
NEWS

ఇవాళ వైసీపీలో చేరనున్నజయసుధ

సినీ నటి జయసుధ ఇవాళ సాయంత్రం లోటస్‌పాండ్‌లో వైసీపీలో చేరనున్నారు. 2009లో కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన జయసుధ.. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయారు. వైఎస్ చనిపోయిన తర్వాత కాంగ్రెస్‌కు పూర్తిగా దూరమయ్యారు. అయితే కొంత కాలం క్రితం టీడీపీలో చేరిన జయసుధ.. ఆ పార్టీలో మాత్రం క్రియాశీల రాజకీయాల్లో కనిపించలేదు. ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. ఇక కీలకమైన 2019 ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ముందు ఆమె వైసీపీ తీర్థం […]

ఇవాళ వైసీపీలో చేరనున్నజయసుధ
X

సినీ నటి జయసుధ ఇవాళ సాయంత్రం లోటస్‌పాండ్‌లో వైసీపీలో చేరనున్నారు. 2009లో కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన జయసుధ.. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయారు. వైఎస్ చనిపోయిన తర్వాత కాంగ్రెస్‌కు పూర్తిగా దూరమయ్యారు.

అయితే కొంత కాలం క్రితం టీడీపీలో చేరిన జయసుధ.. ఆ పార్టీలో మాత్రం క్రియాశీల రాజకీయాల్లో కనిపించలేదు. ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. ఇక కీలకమైన 2019 ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ముందు ఆమె వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. లోటస్ పాండ్‌లో జరిగే ఒక కార్యక్రమంలో ఆమె పార్టీలో చేరనున్నారు.

First Published:  7 March 2019 2:06 AM GMT
Next Story