Telugu Global
Cinema & Entertainment

మళ్లీ తెరపైకి వస్తున్నారు.. కానీ?

విడిపోయిన ప్రేమజంటలు మళ్లీ తెరపై కనిపించడం మామూలే. మరీ ముఖ్యంగా ఇలాంటి సన్నివేశాలు బాలీవుడ్ లో ఎక్కువగా చూస్తుంటాం. ఇప్పుడిలాంటి అరుదైన కలయికను సౌత్ లో కూడా చూడొచ్చు. అవును.. విడిపోయిన ప్రేమజంట మళ్లీ కలుస్తోంది. శింబు-హన్సిక కలిసి ఓ సినిమా చేస్తున్నారు. హన్సిక లీడ్ రోల్ లో ‘మహా’ అనే సినిమా రాబోతోంది. జమీల్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినినిమాలో ఓ కీలక పాత్ర కోసం శింబును సంప్రదించారు. కానీ హన్సిక ఉండడంతో ఆ ప్రాజెక్టులో […]

మళ్లీ తెరపైకి వస్తున్నారు.. కానీ?
X

విడిపోయిన ప్రేమజంటలు మళ్లీ తెరపై కనిపించడం మామూలే. మరీ ముఖ్యంగా ఇలాంటి సన్నివేశాలు బాలీవుడ్ లో ఎక్కువగా చూస్తుంటాం. ఇప్పుడిలాంటి అరుదైన కలయికను సౌత్ లో కూడా చూడొచ్చు. అవును.. విడిపోయిన ప్రేమజంట మళ్లీ కలుస్తోంది. శింబు-హన్సిక కలిసి ఓ సినిమా చేస్తున్నారు.

హన్సిక లీడ్ రోల్ లో ‘మహా’ అనే సినిమా రాబోతోంది. జమీల్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినినిమాలో ఓ కీలక పాత్ర కోసం శింబును సంప్రదించారు. కానీ హన్సిక ఉండడంతో ఆ ప్రాజెక్టులో చేయడానికి శింబు ఒప్పుకోలేదు. కానీ జమీల్ ఒప్పించాడు. అలా హన్సిక, శింబు మరోసారి తెరపైకి రాబోతున్నారు. ఈ విషయాన్ని హన్సిక నిర్థారించడం విశేషం.

గతంలో దాదాపు మూడేళ్లు ప్రేమించుకున్నారు హన్సిక, శింబు. వాళ్ల ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వెళ్లింది. తామిద్దరం పెళ్లి చేసుకుంటామంటూ స్వయంగా హన్సిక ప్రకటించింది. కానీ అప్పట్లో రెండు కుటుంబాల మధ్య గొడవలు వచ్చి ఆ సంబంధం తెగిపోయింది. అప్పట్నుంచి ఎడమొహం-పెడమొహంగా ఉంటున్న ఈ జంట, మళ్లీ ఇన్నేళ్లకు కలవబోతోంది. మరి రియల్ లైఫ్ లో కూడా కలుస్తారా?

First Published:  6 March 2019 8:52 PM GMT
Next Story