Telugu Global
NEWS

డీజీపీపై వేటు తప్పదా?... వెంకటేశ్వరరావుకూ ఎసరు?

ఏపీలో పోలీస్ వ్యవస్థపై చాలా కాలంగా పలు ఆరోపణలు వస్తున్నాయి. చంద్రబాబు ఒత్తిడికి లొంగి ఉన్నతాధికారులు టీడీపీకి వంత పాడుతున్నారన్న ఆరోపణ ఉంది. డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్‌లపై వైసీపీ నేరుగా ఆరోపణలు చేస్తూ వచ్చింది. ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ రాబోతోంది. కోడ్‌ అమలులోకి వస్తే పోలీసు వ్యవస్థ కూడా ఎన్నికల కమిషన్ పరిధిలోనే పనిచేయాల్సి ఉంటుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను ఈసీ పక్కన పెట్టే అవకాశం […]

డీజీపీపై వేటు తప్పదా?... వెంకటేశ్వరరావుకూ ఎసరు?
X

ఏపీలో పోలీస్ వ్యవస్థపై చాలా కాలంగా పలు ఆరోపణలు వస్తున్నాయి. చంద్రబాబు ఒత్తిడికి లొంగి ఉన్నతాధికారులు టీడీపీకి వంత పాడుతున్నారన్న ఆరోపణ ఉంది. డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్‌లపై వైసీపీ నేరుగా ఆరోపణలు చేస్తూ వచ్చింది. ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసింది.

ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ రాబోతోంది. కోడ్‌ అమలులోకి వస్తే పోలీసు వ్యవస్థ కూడా ఎన్నికల కమిషన్ పరిధిలోనే పనిచేయాల్సి ఉంటుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను ఈసీ పక్కన పెట్టే అవకాశం ఉంది. ఈకోవలోనే ఏపీ డీజీపీని పక్కన పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

డీజీపీ ఠాకూర్‌తో పాటు, అనేక విమర్శలు ఎదుర్కొన్న ఇంటెలిజెన్స్ చీఫ్‌ ఐబీ వెంకటేశ్వరరావును కూడా ఈసీ పక్కన పెట్టే అవకాశం ఉంది. ఏపీలోని డీజీల జాబితాలను పంపాల్సిందిగా ఈసీ కోరడం కూడా ఇందుకు బలాన్నిస్తోంది. ఎన్నికల సమయంలో కొత్త డీజీపీగా గౌతమ్ సవాంగ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

సీఆర్‌పీఎఫ్‌ డీజీ (ఢిల్లీ)గా డిప్యుటేషన్‌ పై ఉన్న వీఎస్‌కే కౌముది, జైళ్ల శాఖ డీజీ వినయ్‌రంజన్‌ రే, 1987 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ ఎన్‌వీ సురేంద్రబాబు, రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఏఆర్‌ అనురాధ పేర్లతో కూడిన జాబితా ఈసీకి చేరినట్టు తెలుస్తోంది.

First Published:  6 March 2019 9:03 PM GMT
Next Story