Telugu Global
Cinema & Entertainment

బాలయ్య-బోయపాటి వస్తున్నారోచ్!

ఇప్పటికే వీళ్లిద్దరి కాంబోలో సింహా, లెజెండ్ లాంటి రెండు బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. బాలయ్యకు హిట్ ఇవ్వాలంటే అది బోయపాటితోనే సాధ్యమని ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. ఈ నేపథ్యంలో బాలయ్య-బోయపాటి సినిమా పక్కా అయింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ నెలాఖరుకు (బహుశా మార్చి 28 కావొచ్చు) ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఉంటుంది. సినిమా లాంచ్ అయినా, రెగ్యులర్ షూటింగ్ మాత్రం స్టార్ట్ అవ్వదు. రాబోయే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని పూర్తిగా రాజకీయాలకే పరిమితం కావాలని […]

బాలయ్య-బోయపాటి వస్తున్నారోచ్!
X

ఇప్పటికే వీళ్లిద్దరి కాంబోలో సింహా, లెజెండ్ లాంటి రెండు బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. బాలయ్యకు హిట్ ఇవ్వాలంటే అది బోయపాటితోనే సాధ్యమని ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. ఈ నేపథ్యంలో బాలయ్య-బోయపాటి సినిమా పక్కా అయింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ నెలాఖరుకు (బహుశా మార్చి 28 కావొచ్చు) ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఉంటుంది.

సినిమా లాంచ్ అయినా, రెగ్యులర్ షూటింగ్ మాత్రం స్టార్ట్ అవ్వదు. రాబోయే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని పూర్తిగా రాజకీయాలకే పరిమితం కావాలని బాలయ్య నిర్ణయించాడు. పాలిటిక్స్ లో అతడు చేసేది పెద్దగా ఏం ఉండదు. కాకపోతే ఎన్నికల టైమ్ లో కూడా సినిమాలు చేస్తే, ప్రతిపక్షాలు విమర్శించడానికి కోరి అవకాశం ఇచ్చినట్టవుతుందని బాలయ్యే సినిమాను వాయిదావేశాడు.

సో.. ఎలక్షన్లు పూర్తయి, ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత బాలయ్య-బోయపాటి సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. అంటే బోయపాటికి చాలా టైమ్ దొరుకుతుందన్నమాట. ఈ టైమ్ లో అతడు ఎంచక్కా ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకోవచ్చు.

First Published:  7 March 2019 7:00 AM GMT
Next Story