Telugu Global
Cinema & Entertainment

నక్సలైట్ పాత్రలో సాయిపల్లవి.. జూన్ నుంచి సినిమా షూటింగ్..!

“నీది నాది ఓకే కథ” అనే సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు వేణు ఉడుగుల. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా డీసెంట్ హిట్‌గా నిలిచింది. కలెక్షన్స్ పరంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరచినా కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఈ సినిమా దర్శకుడు వేణు తన తదుపరి సినిమాని సాయి పల్లవి మెయిన్ లీడ్‌గా రూపొందిస్తున్నాడు. సాయి పల్లవి కూడా కథ నచ్చి వెంటనే ఈ లేడీ ఓరియెంటెడ్ […]

నక్సలైట్ పాత్రలో సాయిపల్లవి.. జూన్ నుంచి సినిమా షూటింగ్..!
X

“నీది నాది ఓకే కథ” అనే సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు వేణు ఉడుగుల. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా డీసెంట్ హిట్‌గా నిలిచింది. కలెక్షన్స్ పరంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరచినా కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఇక ఈ సినిమా దర్శకుడు వేణు తన తదుపరి సినిమాని సాయి పల్లవి మెయిన్ లీడ్‌గా రూపొందిస్తున్నాడు. సాయి పల్లవి కూడా కథ నచ్చి వెంటనే ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమాకి ఓకే చెప్పింది. ఈ సినిమాలో సాయి పల్లవి నక్సలైట్ పాత్రలో కనిపించనుంది.

ఇక రానా దగ్గుబాటి కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించనున్నాడు. రానా పాత్రకి సాయి పల్లవి పాత్రకి మధ్య వచ్చే సన్నివేశాలని చాలా బాగా రాసుకున్నాడంటా వేణు ఉడుగుల. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్‌కి వెళ్లనుంది. అతి త్వరలో ఈ సినిమాపై దర్శకుడి నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

First Published:  5 March 2019 11:05 PM GMT
Next Story