Telugu Global
NEWS

తెలంగాణ‌లో బాబుకు ఇవే చివ‌రి ఎన్నిక‌లు కావాలి : కేసీఆర్

రాబోయే లోక్‌‌స‌భ ఎన్నిక‌లు తెలుగుదేశం పార్టీకి చివరి ఎన్నిక‌లు కావాలని.. ఇకపై తెలంగాణలో జ‌రిగే ఏ ఎన్నిక‌ల్లోనూ తెలుగ‌దేశం పార్టీ కాని, చంద్ర‌బాబు గాని తొంగి చూడ‌డానికి కూడా సాహసించ కూడదని టీఆర్ఎస్ అధినేత కంకణం కట్టారు. తన నిర్ణయానికి తగ్గట్లుగా లోక్‌‌స‌భ ఎన్నిక‌లు ఫ‌లితాలు ఉండాలని తెలంగాణ సీఎం కె. చంద్ర‌శేఖ‌ర రావు పార్టీ శ్రేణుల‌ను ఆదేశించారు. తెలంగాణ‌లోని 17 లోక్‌స‌భ స్దానాల‌లో ఒక స్థానాన్ని మ‌జ్లీస్ గెలుచుకుంటుంద‌ని, మిగిలిన 16 స్దానాలు టిఆర్ఎస్ కైవ‌సం […]

తెలంగాణ‌లో బాబుకు ఇవే చివ‌రి ఎన్నిక‌లు కావాలి : కేసీఆర్
X

రాబోయే లోక్‌‌స‌భ ఎన్నిక‌లు తెలుగుదేశం పార్టీకి చివరి ఎన్నిక‌లు కావాలని.. ఇకపై తెలంగాణలో జ‌రిగే ఏ ఎన్నిక‌ల్లోనూ తెలుగ‌దేశం పార్టీ కాని, చంద్ర‌బాబు గాని తొంగి చూడ‌డానికి కూడా సాహసించ కూడదని టీఆర్ఎస్ అధినేత కంకణం కట్టారు. తన నిర్ణయానికి తగ్గట్లుగా లోక్‌‌స‌భ ఎన్నిక‌లు ఫ‌లితాలు ఉండాలని తెలంగాణ సీఎం కె. చంద్ర‌శేఖ‌ర రావు పార్టీ శ్రేణుల‌ను ఆదేశించారు.

తెలంగాణ‌లోని 17 లోక్‌స‌భ స్దానాల‌లో ఒక స్థానాన్ని మ‌జ్లీస్ గెలుచుకుంటుంద‌ని, మిగిలిన 16 స్దానాలు టిఆర్ఎస్ కైవ‌సం చేసుకోవాల‌ని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. బుధ‌వారం నుంచి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ‌లోని అన్ని లోక్‌స‌భ స్థానాల్లో ప‌ర్యటించ‌నున్నారు. వీలున్నంత వ‌ర‌కూ ఎక్కువ లోక్‌సభ నియోజ‌కవ‌ర్గాల‌లో ప‌గ‌టి పూట టిఆర్ఎస్ కార్య‌కర్త‌ల‌తో, నాయ‌కుల‌తో స‌మావేశ‌మ‌వుతారు. రాత్రిపూట లోక్‌స‌భ‌కు పోటీ చేసే అభ్య‌ర్దితో పాటు దాని ప‌రిధిలోని ఏడు శాస‌న‌స‌భ నియోజ‌క వ‌ర్గాల ఎమ్మెల్యేలు, పార్టీ సీనియ‌ర్ నాయ‌కుల‌తో స‌మావేశం జ‌రుపుతారు.

ఈ ప్రణాళికను ముఖ్య‌మంత్రి కేసీఆర్ రూపొందించినట్లు తెలుస్తోంది. ఇంత ప‌గడ్భంది వ్యూహానికి కార‌ణం తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ ఉనికి కూడా లేకుండా చేయ‌డమేన‌ని అంటున్నారు. గ‌త శాస‌న‌స‌భ‌ ఎన్నిక‌ల‌లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు త‌మ‌ను ఓడించేందుకు బ‌ద్ద శ‌త్రువైన కాంగ్రెస్‌తో కూడా చేతులు క‌లిపార‌ని.. దీనికి ధీటుగా స‌మాధానం చెప్పే స‌మ‌యం వ‌చ్చింద‌ని కేసీఆర్ పార్టీ శ్రేణుల‌తో అన్న‌ట్లు స‌మాచారం.

తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోయే ద‌శ‌లో ఉంద‌ని దీనికి లోక్‌స‌భ ఎన్నిక‌ల‌తో చరమగీతం పాడాల‌ని కేసీఆర్ పార్టీ శ్రేణులతో అన్న‌ట్లు చెబుతున్నారు. తెలంగాణ‌లో ప్ర‌జ‌లు త‌మ ప‌ట్ల న‌మ్మ‌కంతో ఉన్నార‌ని మ‌ధ్య‌లో చంద్ర‌బాబు త‌న రాజ‌కీయాల‌తో ఏదైన చేసేందుకు సిద్ద‌ప‌డ‌తార‌ని అలాంటివి ఏమి జ‌ర‌గ‌కుండా ఇప్ప‌టి నుంచే ప‌గ‌డ్బంది వ్యూహం అమ‌లుచేయాల‌ని కేటీఆర్‌కు దిశానిర్థేశం చేసినట్లు సమాచారం.

” గెలుపు మ‌న‌కు సాధ్య‌మే దాన్ని అడ్డుకోన‌వ‌డం ఎవ‌రి త‌రం కాదు. మ‌న ల‌క్ష్యం తెలుగుదేశం పార్టీని, చంద్ర‌బాబును తెలంగాణ‌లో లేకుండా చేయ‌డ‌మే.” అని కేసీఆర్ స్ప‌ష్టం చేసిట్లు స‌మాచారం. ఈ ఏకైక ల‌క్ష్యంతో పార్టీలో సీనియ‌ర్ నాయ‌కులు, మంత్రులు, శాస‌న‌స‌భ్యులు క‌ల‌సి క‌ట్టుగా పనిచేయాల‌ని కేసీఆర్ దిశానిర్దేశం చేశారంటా.

First Published:  5 March 2019 11:59 PM GMT
Next Story