Telugu Global
Cinema & Entertainment

శర్వానంద్ కోసం లవ్‌స్టోరీ రెడీ చేసిన చందు మొండేటి

యంగ్ హీరో శర్వానంద్ గత ఏడాది “పడి పడి లేచే మనసు” సినిమాతో ఫ్లాప్‌ని అందుకున్నాడు. ఆ సినిమా తరువాత శర్వానంద్ “స్వామి రారా” ఫేం సుధీర్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. పూర్తి స్థాయి గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో శర్వానంద్ రెండు విభిన్న లుక్స్‌లో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో శర్వానంద్ సరసన కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. […]

శర్వానంద్ కోసం లవ్‌స్టోరీ రెడీ చేసిన చందు మొండేటి
X

యంగ్ హీరో శర్వానంద్ గత ఏడాది “పడి పడి లేచే మనసు” సినిమాతో ఫ్లాప్‌ని అందుకున్నాడు. ఆ సినిమా తరువాత శర్వానంద్ “స్వామి రారా” ఫేం సుధీర్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. పూర్తి స్థాయి గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో శర్వానంద్ రెండు విభిన్న లుక్స్‌లో కనిపించనున్నాడు.

ఇక ఈ సినిమాలో శర్వానంద్ సరసన కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక ఈ సినిమా అయిపోయిన వెంటనే చందు మొండేటి దర్శకత్వంలో ఓక సినిమా చేయనున్నాడు శర్వానంద్.

ఇప్పటికే శర్వానంద్ కోసం ఒక అదిరిపోయే లవ్ స్టొరీని చందు సిద్ధం చేశాడట. చందు మొండేటి చెప్పిన లవ్‌స్టొరీ నచ్చి వెంటనే సినిమాకి ఓకే చేప్పాడని ఫిల్మ్‌నగర్ టాక్. గత ఏడాది “సవ్యసాచి” సినిమాతో ఫ్లాప్‌ని అందుకున్న చందు మొండేటికి ఇప్పుడు ఒక హిట్ అవసరం. అందుకే శర్వానంద్‌తో ఒక కొత్త రకమైన లవ్‌స్టొరీని తెరకెక్కించాలని చందు ప్లాన్ చేశాడు.

First Published:  6 March 2019 12:38 AM GMT
Next Story