Telugu Global
NEWS

షా వస్తున్నారు.... షో చూపిస్తారా!?

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బుధవారం నాడు తెలంగాణ జిల్లాలో పర్యటించనున్నారు. నిజామాబాద్ జిల్లాలో జరిగే పార్టీ సమావేశంలో పాల్గొనేందుకు అమిత్ షా వస్తున్నారని పార్టీ వర్గాలు పైకి చెబుతున్నా… రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రధానాంశంగా అంశంగా ఉంటుందని భావిస్తున్నారు. అమిత్ షా రాకకు అదే ముఖ్య కారణమని చెబుతున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లోనైనా కనీసం […]

షా వస్తున్నారు.... షో చూపిస్తారా!?
X

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బుధవారం నాడు తెలంగాణ జిల్లాలో పర్యటించనున్నారు. నిజామాబాద్ జిల్లాలో జరిగే పార్టీ సమావేశంలో పాల్గొనేందుకు అమిత్ షా వస్తున్నారని పార్టీ వర్గాలు పైకి చెబుతున్నా… రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రధానాంశంగా అంశంగా ఉంటుందని భావిస్తున్నారు. అమిత్ షా రాకకు అదే ముఖ్య కారణమని చెబుతున్నారు.

శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లోనైనా కనీసం ఐదారు స్థానాలు గెలుచుకోవాలని అమిత్ షా పట్టుదలగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇందు కోసమే పార్టీ శ్రేణులతో మాట్లాడేందుకు అమిత్ షా నిజామాబాద్ పర్యటన పేరుతో తెలంగాణ వస్తున్నారని అంటున్నారు.

ఇటీవల ముగిసిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్లు కూడా కోల్పోయింది. తెలంగాణలో దాదాపు 100కు పైగా స్థానాల నుంచి పోటీ చేసినా కేవలం ఒక్కటంటే ఒకే స్థానంలో విజయం సాధించింది. 90 పైగా చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. దీనిపై పార్టీ అధిష్టానం సీరియస్‌గా స్పందించినట్లు అప్పట్లోనే వార్తలు వచ్చాయి. శాసనసభ స్థానాలు కోల్పోయినా లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం అలా జరగడానికి వీల్లేదని.. గెలుపు గుర్రాలను మాత్రమే బరిలో దించాలని అమిత్ షా నిర్ణయించినట్లు చెబుతున్నారు.

శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన కొందరు శాసనసభ అభ్యర్థులు లోక్‌సభకు పోటీ చేయాలని భావిస్తున్నారు. కిషన్ రెడ్డి వంటి నాయకులు సికింద్రాబాద్ లోక్‌సభ లేదా మల్కాజిగిరి స్థానం నుంచి పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఒకసారి ఓటమి పాలైనవారు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదని, అలాంటి ఆశలు పెట్టుకోవద్దు అంటూ సీనియర్ నాయకులకు సూచించినట్లు సమాచారం. దీంతో తెలంగాణలో పర్యటించనున్న అమిత్ షా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడంతో పాటు కొన్ని షాక్‌లు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.

First Published:  5 March 2019 10:13 PM GMT
Next Story