Telugu Global
Cinema & Entertainment

బైక్ రేసర్‌గా విజయ్ దేవరకొండ.

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం “డియర్ కామ్రేడ్” సినిమాతో బిజీగా ఉన్నాడు. రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా భరత్ కమ్మ అనే దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాతో పాటు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వస్తున్న ఒక సినిమా షూటింగ్‌లో కూడా విజయ్ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాలతో బిజీగా ఉన్నా కూడా ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్‌కు విజయ్ సైన్ చేశాడు. తమిళ్‌లో రైటర్‌గా మంచి […]

బైక్ రేసర్‌గా విజయ్ దేవరకొండ.
X

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం “డియర్ కామ్రేడ్” సినిమాతో బిజీగా ఉన్నాడు. రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా భరత్ కమ్మ అనే దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాతో పాటు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వస్తున్న ఒక సినిమా షూటింగ్‌లో కూడా విజయ్ బిజీగా ఉన్నాడు.

ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాలతో బిజీగా ఉన్నా కూడా ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్‌కు విజయ్ సైన్ చేశాడు. తమిళ్‌లో రైటర్‌గా మంచి పేరు తెచ్చుకున్న ఆనంద్ అన్నామలైని డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ ఒక సినిమా తీస్తున్నారు. బైక్ రేసింగ్ నేపధ్యంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో విజయ్ రేసర్‌గా నటిస్తున్నాడు. అందుకే ఈ సినిమా కోసం ఇప్పటి నుంచే బైక్ రేసింగ్ కూడా నేర్చుకుంటున్నాడు.

ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యాక తొలి షెడ్యూల్‌లోనే విజయ్ మీద బైక్ రేసింగ్ సీన్‌ని దర్శకుడు ప్లాన్ చేశాడు. ఢిల్లీలో దీనికి సంబంధించిన షూటింగ్ జరగబోతుంది. ఈ సినిమాను తమిళ్‌తో పాటు తెలుగు కూడా విడుదల కాబోతుంది..

First Published:  5 March 2019 5:26 AM GMT
Next Story