Telugu Global
Cinema & Entertainment

మంచు లక్ష్మి పారితోషికం రూ.5 కోట్లు

తెలుగులో స్టార్ హీరోయిన్‌కు మహా అయితే కోటిన్నర ఇస్తారు. మంచి పీక్ లో ఉన్నప్పుడు సమంత 2 కోట్ల రూపాయలు తీసుకుంది. తమిళ్‌లో నయనతార కూడా 2 కోట్లు రూపాయలు తీసుకుంటోంది. కానీ సౌత్ లో 5 కోట్లు పారితోషికం తీసుకునే హీరోయిన్ ఎవరైనా ఉన్నారా? ఇంత ఎమౌంట్ దక్కించుకోవడం దాదాపు అసంభవం. కానీ మంచు లక్ష్మీ ఈ అరుదైన ఘనత సాధించింది. అవును.. ఆమె ఏకంగా 5 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంది. జీ5 యాప్ […]

మంచు లక్ష్మి పారితోషికం రూ.5 కోట్లు
X

తెలుగులో స్టార్ హీరోయిన్‌కు మహా అయితే కోటిన్నర ఇస్తారు. మంచి పీక్ లో ఉన్నప్పుడు సమంత 2 కోట్ల రూపాయలు తీసుకుంది. తమిళ్‌లో నయనతార కూడా 2 కోట్లు రూపాయలు తీసుకుంటోంది. కానీ సౌత్ లో 5 కోట్లు పారితోషికం తీసుకునే హీరోయిన్ ఎవరైనా ఉన్నారా? ఇంత ఎమౌంట్ దక్కించుకోవడం దాదాపు అసంభవం. కానీ మంచు లక్ష్మీ ఈ అరుదైన ఘనత సాధించింది. అవును.. ఆమె ఏకంగా 5 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంది.

జీ5 యాప్ కోసం మిసెస్ సుబ్బలక్ష్మీ అనే వెబ్ సిరీస్ చేసింది మంచు లక్ష్మీ. ఈ వెబ్ సిరీస్ కోసం ఆమె అక్షరాలా 5 కోట్ల రూపాయల మొత్తం అందుకుందట. నిజానికి ఈ ప్రాజెక్టుకు అన్నీ తానై వ్యవహరించిందామె. నటించడంతో పాటు నిర్మాణం పనులు కూడా చూసుకుంది. పైగా ఇది సినిమా కాదు. దాదాపు 6 భాగాల్లో వచ్చే సిరీస్. అందుకే ఆమెకు ఇంత మొత్తం లభించింది.

ఒక విధంగా చెప్పాలంటే నిర్మాణంతో కలుపుకొని 6 ఎపిసోడ్లకు ఇది తక్కువ మొత్తమే. కానీ అదంతా తన రెమ్యూనరేషన్ కింద చెప్పుకుంటోంది మంచు లక్ష్మి. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. ముందుగా దీన్ని ఓ సినిమాగా తీద్దాం అనుకున్నారు. తర్వాత డీలింగ్స్ కుదిరి, సినిమా కాస్తా వెబ్ సిరీస్ గా మారిపోయింది. అవసరాల శ్రీనివాస్ కూడా ఇందులో నటిస్తున్నాడు. సుబ్బలక్ష్మి పాత్రలో మంచు లక్ష్మి కనిపిస్తే, సుబ్రమణ్యం పాత్రలో అవసరాల కనిపిస్తాడన్నమాట.

First Published:  5 March 2019 7:46 AM GMT
Next Story