Telugu Global
International

ఈ చెన్నై కుర్రాడు.. తన టాలెంట్‌తో అమెరికానే 'వావ్' అనిపించాడు..!

ఆ కుర్రాడి పేరు లిడియన్ నాదస్వరం. చెన్నైకి చెందిన ఈ 13 ఏళ్ల కుర్రాడి టాలెంట్ చూసి అమెరికా ప్రజలు వారేవా అని అన్నారు. అసలు ఆ టాలెంట్‌కి ఏఆర్ రెహమానే ఫిదా అయ్యాడు. మీరు తెలుసుకుంటే ‘వావ్’ అని తప్పక అంటారు. లిడియన్ తన రెండేళ్ల వయసు నుంచే పియానో నేర్చుకుంటున్నాడు. ప్రతీ రోజు దానిపై సాధన చేస్తూ ఇప్పుడు ఏకంగా యూఎస్‌లో మోస్ట్ పాపులర్ టాలెంట్ షో ‘ది వరల్డ్స్ బెస్ట్’లో ప్రదర్శన ఇచ్చాడు. […]

ఈ చెన్నై కుర్రాడు.. తన టాలెంట్‌తో అమెరికానే వావ్ అనిపించాడు..!
X

ఆ కుర్రాడి పేరు లిడియన్ నాదస్వరం. చెన్నైకి చెందిన ఈ 13 ఏళ్ల కుర్రాడి టాలెంట్ చూసి అమెరికా ప్రజలు వారేవా అని అన్నారు. అసలు ఆ టాలెంట్‌కి ఏఆర్ రెహమానే ఫిదా అయ్యాడు. మీరు తెలుసుకుంటే ‘వావ్’ అని తప్పక అంటారు.

లిడియన్ తన రెండేళ్ల వయసు నుంచే పియానో నేర్చుకుంటున్నాడు. ప్రతీ రోజు దానిపై సాధన చేస్తూ ఇప్పుడు ఏకంగా యూఎస్‌లో మోస్ట్ పాపులర్ టాలెంట్ షో ‘ది వరల్డ్స్ బెస్ట్’లో ప్రదర్శన ఇచ్చాడు. ఆ ప్రదర్శనతో అమెరికా వాసులు వారేవా ఏం టాలెంట్ అంటున్నారు.

లిడియన్ ప్రత్యేకత ఏంటంటే ఒకే సమయంలో రెండు పియానోలపై రెండు వేర్వేరు పాటలు వాయించగలడు. ఒకవైపు మిషన్ ఇంపాజిబుల్ వాయిస్తూనే మరో వైపు హ్యారీ పోట్టర్ సంగీతాన్ని ప్లే చేయడం చూసి ఇలాంటి టాలెంట్ ఎక్కడా ఉండదని అమెరికన్స్ అంటున్నారు. ఇక మరో విషయం తను కళ్ళకు గంతలు కట్టుకొని ఏ పాటనైనా అవలీలగా వాయించగల్గడం.

ఈ బాల మేధావి టాలెంట్ ఫిదా అయి.. ఎల్లెన్ తన పాపులర్ ప్రోగ్రాం ‘ది ఎల్లెన్ షో’కి పిలిపించింది. అక్కడ అతడిని పలు ప్రశ్నలు అడిగింది. తన ప్రతిభకు కారణం ప్రతీ రోజు 5 నుంచి 6 గంటలు సాధన చేయడమే అని లిడియన్ చెబుతున్నాడు. ఏనాటికైనా చంద్రునిపై దిగి అక్కడ పియానో వాయించాలని తన కోరికను బయటపెట్టాడు.

లిడియన్ చేసిన ఈ ప్రోగ్రాం వీడియో ఫేస్‌బుక్‌లో ఉంచితే 26 లక్షల వ్యూస్, 49 వేల లైక్స్ వచ్చాయి. కేవలం పియానోనే కాక మృదంగం, తబలా, గిటార కూడా ప్లే చేస్తాడు ఈ అద్భుతమైన బాల సంగీత విధ్వాంసుడు.

Lydian is only 13 years old, and he can play Mozart blindfolded.

Lydian is only 13 years old, and he can play Mozart blindfolded. I’m 61 and I can’t spell Mozart blindfolded. The World's Best

Posted by Ellen DeGeneres on Wednesday, 27 February 2019

First Published:  4 March 2019 8:30 PM GMT
Next Story