Telugu Global
Cinema & Entertainment

డిస్కోరాజా ఆట మొదలైంది

ఎట్టకేలకు సినిమా స్టార్ట్ చేశాడు రవితేజ. అమర్ అక్బర్ ఆంటోనీ ఘోరంగా ఫ్లాప్ అవ్వడంతో ఇక రవితేజ గ్యాప్ తీసుకుంటాడని అంతా భావించారు. కానీ మాస్ రాజా మాత్రం షార్ట్ గ్యాప్ మాత్రమే తీసుకున్నాడు. ఈరోజు వీఐ ఆనంద్ దర్శకత్వంలో కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు. రేపట్నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. నిజానికి వీఐ ఆనంద్ సినిమాను వెంటనే సెట్స్ పైకి తీసుకురావాలని భావించాడు రవితేజ. అయితే అమర్ అక్బర్ ఆంటోనీ డిజాస్టర్ అవ్వడంతో.. […]

డిస్కోరాజా ఆట మొదలైంది
X

ఎట్టకేలకు సినిమా స్టార్ట్ చేశాడు రవితేజ. అమర్ అక్బర్ ఆంటోనీ ఘోరంగా ఫ్లాప్ అవ్వడంతో ఇక రవితేజ గ్యాప్ తీసుకుంటాడని అంతా భావించారు. కానీ మాస్ రాజా మాత్రం షార్ట్ గ్యాప్ మాత్రమే తీసుకున్నాడు. ఈరోజు వీఐ ఆనంద్ దర్శకత్వంలో కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు. రేపట్నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది.

నిజానికి వీఐ ఆనంద్ సినిమాను వెంటనే సెట్స్ పైకి తీసుకురావాలని భావించాడు రవితేజ. అయితే అమర్ అక్బర్ ఆంటోనీ డిజాస్టర్ అవ్వడంతో.. డిస్కోరాజా స్క్రిప్ట్ పై మరింత వర్క్ చేయాల్సిందిగా దర్శకుడ్ని కోరాడు. అందుకే సినిమా కాస్త ఆలస్యమైంది. ఫైనల్ స్క్రిప్ట్ తనకు ఎంతగానో నచ్చిందని, అందుకే సినిమాను మొదలుపెట్టామని అంటున్నాడు రవితేజ.

వస్తున్న గాసిప్స్ మాత్రం మరోలా ఉన్నాయి. రవితేజ సినిమా లేట్ అవ్వడంతో, వీఐ ఆనంద్ మరో సినిమాకు షిఫ్ట్ అవ్వాలని అనుకున్నాడట. ఈ విషయం తెలిసిన మేకర్స్ వెంటనే ఇలా లాంఛింగ్ కు, రెగ్యులర్ షూటింగ్ కు ఏర్పాట్లు చేశారట. అదీ సంగతి.

First Published:  4 March 2019 1:33 AM GMT
Next Story