Telugu Global
International

గంగూలీ, బీజేపీ మధ్య ఇమ్రాన్ ఖాన్ ఫొటో వివాదం

పుల్వామా ఘటన తర్వాత ఇండియా, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రికతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దానికి పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న జైషే మహ్మద్ సంస్థే కారణమని తెలిసి దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఇరుదేశాల మధ్య ఎలాంటి వివాదం నెలకొన్నా మొదట క్రీడాకారులు, కళాకారులపైనే ఆ ప్రభావం పడుతుంటుంది. ఈ నేపథ్యంలోనే ముంబైలోని సీసీఐ (క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా) తమ రెస్టారెంట్‌లో ఉన్న మాజీ క్రికెటర్, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫొటోను తొలగించింది. […]

గంగూలీ, బీజేపీ మధ్య ఇమ్రాన్ ఖాన్ ఫొటో వివాదం
X

పుల్వామా ఘటన తర్వాత ఇండియా, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రికతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దానికి పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న జైషే మహ్మద్ సంస్థే కారణమని తెలిసి దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.

ఇరుదేశాల మధ్య ఎలాంటి వివాదం నెలకొన్నా మొదట క్రీడాకారులు, కళాకారులపైనే ఆ ప్రభావం పడుతుంటుంది. ఈ నేపథ్యంలోనే ముంబైలోని సీసీఐ (క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా) తమ రెస్టారెంట్‌లో ఉన్న మాజీ క్రికెటర్, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫొటోను తొలగించింది. ఇతర పాకిస్తానీ క్రీడాకారుల ఫొటోలను తమ గ్యాలరీల నుంచి తీసేశారు. సీసీఐ బాటనే పలు రాష్ట్రాల క్రికెట్ సంఘాలు అనుసరించాయి.

అయితే కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ స్టేడియం నుంచి ఇమ్రాన్ ఖాన్ ఫొటో తొలగించడానికి క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అంగీకరించలేదు. దీంతో ఆ రాష్ట్ర బీజేపీ నాయకులు గంగూలీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

గంగూలీ మాత్రం ఫొటోలు తొలగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ ఫొటో తొలగించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని…. గంగూలీ కచ్చితంగా తొలగించాల్సిందే అని బీజేపీ నాయకులు అంటున్నారు.

ఇక ఈ వివాదం బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్‌ల మధ్య యుద్దంగా మారింది. మమతా బెనర్జీ చొరవతోనే గంగూలీ క్యాబ్ అధ్యక్షుడు అయ్యాడని.. ఇప్పుడు ఆమె ఆదేశాల మేరకే ఫొటోలు తొలగించట్లేదని బీజేపీ ఆరోపిస్తోంది. గత కొంత కాలంగా బెంగాల్‌లో బీజేపీ వర్సెస్ టీఎంసీ వార్ నడుస్తోంది. ఇది చివరకు క్రీడాకారుల ఫొటోలను కూడా వివాదం చేసేదాకా వెళ్లిందంటే…. దేశభక్తి రాజకీయాలు ఎలా ఉంటాయో అర్థమవుతోంది.

First Published:  4 March 2019 3:44 AM GMT
Next Story