Telugu Global
NEWS

పీఠాధిపతుల ఆశీస్సులు జగన్ కే...!

గత ఎన్నికలప్పుడు విజయమ్మ చేతిలో బైబిల్ పట్టుకోవడాన్ని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో ఎంత నష్టం కలిగించ వచ్చో అంత నష్టమూ కలిగించడంలో ఎల్లో మీడియా, టీడీపీ శ్రేణులు విజయవంతమయ్యాయి. ఈసారి కూడా ఇలాంటి ప్రచారమే తమకు ఓట్లు తెచ్చిపెడుతుందని, భవిష్యత్తులో తిరిగి అధికారంలోకి వస్తామని తెలుగుదేశం నాయకులు…. ముఖ్యంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆశించారు. అయితే, ఇటీవలి పరిణామాలు తెలుగు దేశం నాయకుల అంచనాలు తలకిందులు చేసినట్లు గా […]

పీఠాధిపతుల ఆశీస్సులు జగన్ కే...!
X

గత ఎన్నికలప్పుడు విజయమ్మ చేతిలో బైబిల్ పట్టుకోవడాన్ని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో ఎంత నష్టం కలిగించ వచ్చో అంత నష్టమూ కలిగించడంలో ఎల్లో మీడియా, టీడీపీ శ్రేణులు విజయవంతమయ్యాయి.

ఈసారి కూడా ఇలాంటి ప్రచారమే తమకు ఓట్లు తెచ్చిపెడుతుందని, భవిష్యత్తులో తిరిగి అధికారంలోకి వస్తామని తెలుగుదేశం నాయకులు…. ముఖ్యంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆశించారు. అయితే, ఇటీవలి పరిణామాలు తెలుగు దేశం నాయకుల అంచనాలు తలకిందులు చేసినట్లు గా రాజకీయ పండితులు చెబుతున్నారు.

రెండు రోజుల క్రితం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై. యస్. జగన్మోహన్ రెడ్డి హైదరాబాదులో త్రిదండి చిన్న జీయర్ స్వామిని కలుసుకున్నారు. ఆయన పాదాలకు వైయస్ జగన్మోహన్ రెడ్డి నమస్కారం చేసి ఆయన పట్ల తనకున్న గౌరవాన్ని చాటిచెప్పారు.

చినజీయర్ స్వామి ఆశ్రమం లో ప్రధాన ద్వారం వరకు వచ్చి వైయస్ జగన్మోహన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానించారు. ఇద్దరూ ఎదురు ఎదురుగా నేల మీద కూర్చుని ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ నాయకులకు, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కు మింగుడు పడలేదని పార్టీ నాయకులు కొందరు చెబుతున్నారు.

నెలరోజుల క్రితం విశాఖపట్నానికి చెందిన మరో పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆయన పాలన పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో పాలన అస్తవ్యస్తంగా ఉందని, రానున్న ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ని గద్దె దించాలని స్వరూపానందేంద్ర సరస్వతి పిలుపునిచ్చారు. దీంతో తెలుగుదేశం సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి పై చేసిన మతపరమైన విమర్శలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి లోకి వెళ్లిపోయారు.

తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు పీఠాధిపతులు… అది కూడా విశేషమైన భక్త జనసందోహాన్ని కలిగిన పీఠాధిపతులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్రెడ్డిని అభినందించడం, మద్దతు తెలపడం తెలుగుదేశం నాయకులకు మింగుడుపడటం లేదు అంటున్నారు.

పీఠాధిపతులు ఇలా జగన్మోహన్ రెడ్డి పట్ల సానుభూతి, సానుకూలత వ్యక్తం చేయడం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో సహా పార్టీలోని ఇతర నాయకులకు కూడా రుచించడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పీఠాధిపతుల ఆశీస్సులు కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డి కే లభిస్తుండడంతో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు ఏమి చేయాలో పాలుపోవడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

First Published:  3 March 2019 11:47 PM GMT
Next Story