Telugu Global
NEWS

 చంద్రబాబును వెంటాడుతున్న ఓటమి భయం !

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఓటమి భయం వెంటాడుతోందా?  ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో పార్టీ పరాజయం పాలవుతుందని వివిధ సర్వేల తో పాటు పార్టీ సీనియర్ నాయకులు కూడా పదే పదే చెప్పడం చంద్రబాబును కలవరపెడుతోందా? అంటే అవుననే అంటున్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాజకీయ విశ్లేషకులు. గడిచిన రెండు నెలలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా అసహనంగాను, ఆందోళనగాను కనిపిస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రానున్న ఎన్నికలలో […]

 చంద్రబాబును వెంటాడుతున్న ఓటమి భయం !
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఓటమి భయం వెంటాడుతోందా? ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో పార్టీ పరాజయం పాలవుతుందని వివిధ సర్వేల తో పాటు పార్టీ సీనియర్ నాయకులు కూడా పదే పదే చెప్పడం చంద్రబాబును కలవరపెడుతోందా? అంటే అవుననే అంటున్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాజకీయ విశ్లేషకులు.

గడిచిన రెండు నెలలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా అసహనంగాను, ఆందోళనగాను కనిపిస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రానున్న ఎన్నికలలో పార్టీ ఓటమి పాలవుతుందని, ఇప్పటి నుంచే చర్యలు తీసుకోకపోతే నష్టం కలుగుతుందని ఇంటిలిజెన్స్ వర్గాలతో పాటు పలు ప్రైవేట్ ఏజెన్సీలు కూడా చంద్రబాబును హెచ్చరించాయి అంటున్నారు.

ఈ నివేదికలు అందుకున్నప్పటి నుంచి చంద్రబాబులో ఓ భయం గూడుకట్టుకుని ఉందని, దీని నుంచి బయటపడేందుకు పొంతన లేని ఉపన్యాసాలు ఇస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారు.

ఈ సర్వేలకు తోడు తెలుగుదేశం లోక్ సభ సభ్యులు, కొందరు శాసనసభ్యులు పార్టీని వీడడం చంద్రబాబును ఆందోళనకు గురి చేస్తుందని అంటున్నారు.

పార్టీ వీడిన వారు చేస్తున్న విమర్శలపై ఎలాంటి సమాధానం చెప్పలేని స్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నారంటున్నారు. మరోవైపు వైయస్ జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజల్లో సానుభూతి పెరుగుతోందని, పార్టీ నాయకులు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గుచూపడం ఆందోళన కలిగిస్తోంది అంటున్నారు.

దీనిని దృష్టిలో ఉంచుకుని చంద్రబాబునాయుడు పదేపదే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు. గడచిన 15 రోజులుగా చంద్రబాబు నాయుడు లో “వైర‌భ‌క్తి” నానాటికీ పెరుగుతోందని అంటున్నారు.

అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల పట్ల కూడా చంద్రబాబు నాయుడు ఆందోళనకు గురవుతున్నారని అంటున్నారు. ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేల లో 40 శాతం మందిని మారిస్తే తప్ప అధికారం రావడం అసాధ్యమని జేసి దివాకర్ రెడ్డి సంచలన ప్రకటనలు చేశారు. ఇది చంద్రబాబుకు మింగుడు పడటం లేదు.

సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి కొత్త వారికి అవకాశం ఇస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందని, పార్టీ అభ్యర్థి పరాజయం కోసం వారు పని చేస్తారనే భయం చంద్రబాబులో నానాటికీ పెరుగుతోందని అంటున్నారు.

ఈ భయం కారణంగానే తన ప్రసంగాలలో నరేంద్ర మోడీ, కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డి తనను ఏమైనా చేసేందుకు కుట్రలు చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు. ఏకంగా తాను ఎదురయితే ప్రధాని నరేంద్రమోడీ తనను కొడ‌తారేమో అన్న భయాన్ని కూడా చంద్రబాబు నాయుడు వ్యక్తం చేయడం వెనుక ఆయన అనుభవిస్తున్న ఆందోళనే కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

First Published:  3 March 2019 8:47 PM GMT
Next Story