Telugu Global
NEWS

టీడీపీ ఎంపీ గా పోటీ అంటే.... ఎందుకంత భ‌యం?

టీడీపీలో భ‌యం మొద‌లైంది. ఎంపీ సీటు అంటేనే నేత‌లు వ‌ణుకుతున్నారు. బాబూ… ఆ సీటు మాకొద్దు అంటూ ప‌రుగులు పెడుతున్నారు. ఒక్క‌రు కాదు…ఇద్ద‌రు కాదు….ఇప్ప‌టివ‌ర‌కూ ఎనిమిది మంది నేత‌లు ఎంపీ సీట్లు త‌మ‌కు వ‌ద్ద‌ని చంద్ర‌బాబుకి తేల్చి చెప్పారు. దీంతో ఇప్పుడు ఈ సీట్ల‌కు పోటీ చేసేందుకు టీడీపీ నేత‌ల కోసం వెతుకుతోంది. అన‌కాప‌ల్లి, అమ‌లాపురం టీడీపీ ఎంపీలు అవంతి శ్రీనివాస్‌, ర‌వీంద్ర‌బాబు ఇప్ప‌టికే పార్టీ వీడారు. వైసీపీలో చేరారు. ఇక్క‌డ పోటీ చేసేందుకు కొత్త క్యాండేట్ల […]

టీడీపీ ఎంపీ గా పోటీ అంటే.... ఎందుకంత భ‌యం?
X

టీడీపీలో భ‌యం మొద‌లైంది. ఎంపీ సీటు అంటేనే నేత‌లు వ‌ణుకుతున్నారు. బాబూ… ఆ సీటు మాకొద్దు అంటూ ప‌రుగులు పెడుతున్నారు. ఒక్క‌రు కాదు…ఇద్ద‌రు కాదు….ఇప్ప‌టివ‌ర‌కూ ఎనిమిది మంది నేత‌లు ఎంపీ సీట్లు త‌మ‌కు వ‌ద్ద‌ని చంద్ర‌బాబుకి తేల్చి చెప్పారు. దీంతో ఇప్పుడు ఈ సీట్ల‌కు పోటీ చేసేందుకు టీడీపీ నేత‌ల కోసం వెతుకుతోంది.

అన‌కాప‌ల్లి, అమ‌లాపురం టీడీపీ ఎంపీలు అవంతి శ్రీనివాస్‌, ర‌వీంద్ర‌బాబు ఇప్ప‌టికే పార్టీ వీడారు. వైసీపీలో చేరారు. ఇక్క‌డ పోటీ చేసేందుకు కొత్త క్యాండేట్ల కోసం టీడీపీ వెతుకుతోంది. అమ‌లాపురం నుంచి దివంగ‌త బాల‌యోగి కొడుకును బ‌రిలోకి దింపాల‌నేది టీడీపీ ప్లాన్‌. కానీ ఆయ‌న సాప్ట్‌వేర్ ఉద్యోగం వ‌దులుకుని రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకు రెడీగా లేర‌నేది టాక్‌. ఇటు అన‌కాప‌ల్లి నుంచి బీసీ నేత లేదా కాపు నేత‌ల్లో ఎవ‌రో ఒక‌రిని రంగంలోకి దింపాలి. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు.

మ‌రోవైపు రాజంపేట నుంచి డీకే శ్రీనివాసులు కూడా ఈ సారి పోటీ చేసేందుకు సుముఖంగా లేర‌ని తెలుస్తోంది. నెల్లూరు నుంచి ఎంపీ క్యాండేట్ బాబుకు దొర‌క‌డం లేదు. ఇక్క‌డ ఒంగోలు,నెల్లూరు పంచాయ‌తీ న‌డుస్తోంది. ఒంగోలు అభ్య‌ర్థి మాగుంట‌ను నెల్లూరుకు, నెల్లూరు క్యాండేట్ బీద‌మ‌స్తాన్‌ రావును ఒంగోలుకు మార్చాల‌ని చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారు. కానీ బీద ఫ్యామిలీ మాత్రం కావ‌లి నుంచి పోటీ చేయాల‌ని చూస్తోంది. మాగుంట ఈ సారి పోటీ చేసే ఆలోచ‌న చేయ‌డం లేదు. ఆయన వైసీపీ వైపు చూస్తున్నారు.

ఇటు మ‌చిలీప‌ట్నం నుంచి కూడా కొన‌క‌ళ్ల నారాయ‌ణ ఎంపీగా పోటీ చేసేందుకు ఆస‌క్తి చూప‌డం లేదు. ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చంద్ర‌బాబు ముందు ప్ర‌తిపాద‌న పెట్టారు. దీంతో పాటు కాకినాడ ఎంపీ తోట న‌ర‌సింహం ఇప్ప‌టికే పోటీ చేయాన‌ని ప్ర‌క‌టించారు. ఆప‌క్క‌నే రాజ‌మండ్రి ఎంపీ ముర‌ళీ మోహ‌న్ కూడా ఎంపీ సీటుకు నో చెప్పేశారు. న‌ర‌సాపురం ఎంపీగా పోటీ చేస్తార‌ని ఆశించిన ర‌ఘురామ‌కృష్ణం రాజు వైసీపీలో ఆదివారం చేరుతున్నారు. దీంతో ఇక్క‌డ కూడా క్యాండేట్‌ను వెత‌కాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డి, హిందూపురం ఎంపీ నిమ్మ‌ల కిష్ట‌ప్ప‌తో పాటు చాలా మంది నేత‌లు ఈ సారి ఎంపీగా పోటీ చేసేందుకు ఇంట్రెస్ట్ చూప‌డం లేదు.

గ‌త ఎన్నిక‌ల్లో ఎంపీగా గెలిచిన వీళ్ళంతా ఇప్పుడు ఎంపీలుగా ఎందుకు పోటీ చేసేందుకు ఆస‌క్తి చూప‌డం లేద‌ని చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇక్క‌డ మూడు అంశాలు ప్ర‌ధానంగా క‌నిపిస్తున్నాయి. ఈ సారి ఎన్నిక‌ల్లో ఖ‌ర్చు విప‌రీతంగా పెరిగే పోయే అవ‌కాశం క‌న్పిస్తోంది.

రెండోది మ‌ళ్లీ టీడీపీ అధికారంలోకి వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వ‌స్తే త‌మ ప‌రిస్థితి ఏంటి? అనేది ఎంపీల‌కు బెంగ ప‌ట్టుకుంది.

మ‌రోవైపు గ‌త ఐదేళ్ల‌లో సుజ‌నాచౌద‌రి, సీఎం రమేష్‌ లు మాత్ర‌మే రాష్ట్రంలో, కేంద్రంలో ల‌బ్ధి పొందారు. మిగ‌తా ఎంపీల‌కు పైసా ప‌ని జ‌ర‌గ‌లేదు. దీంతో మ‌ళ్లీ గెలిచినా లాభం లేద‌ని అనుకుంటున్న టీడీపీ ఎంపీలు…. ఈ సారి పోటీ చేసేందుకు ముందుకు రావ‌డం లేద‌ని తెలుస్తోంది.

First Published:  2 March 2019 11:58 PM GMT
Next Story