Telugu Global
NEWS

టీడీపీ ఐటీ కంపెనీ వద్ద హైడ్రామా... మఫ్టీలో ఏపీ పోలీసులు

ఏపీలో ఓట్లను తొలగించేందుకు టీడీపీ పన్నిన వ్యూహం బెడిసికొట్టినట్టుగానే ఉంది. సేవా మిత్రా అనే యాప్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సంబంధించిన అన్ని వివరాలను పొందుపరిచి దాన్ని టీడీపీ కార్యకర్తలకు అందుబాటులోకి తెచ్చారు. దాని ద్వారా టీడీపీ కార్యకర్తలు, నేతలు కలిసి ఈజీగా ఓట్లను తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తూ వస్తోంది. ఐటీ గ్రిడ్స్ ఇండియా కంపెనీలో తెలంగాణ పోలీసులు సోదాలు చేశారు. పలు పత్రాలు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. కంపెనీకి చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. టీడీపీకి […]

టీడీపీ ఐటీ కంపెనీ వద్ద హైడ్రామా... మఫ్టీలో ఏపీ పోలీసులు
X

ఏపీలో ఓట్లను తొలగించేందుకు టీడీపీ పన్నిన వ్యూహం బెడిసికొట్టినట్టుగానే ఉంది. సేవా మిత్రా అనే యాప్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సంబంధించిన అన్ని వివరాలను పొందుపరిచి దాన్ని టీడీపీ కార్యకర్తలకు అందుబాటులోకి తెచ్చారు. దాని ద్వారా టీడీపీ కార్యకర్తలు, నేతలు కలిసి ఈజీగా ఓట్లను తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తూ వస్తోంది.

ఐటీ గ్రిడ్స్ ఇండియా కంపెనీలో తెలంగాణ పోలీసులు సోదాలు చేశారు. పలు పత్రాలు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. కంపెనీకి చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. టీడీపీకి చెందిన సేవా మిత్రా యాప్‌ను ఈ ఐటీ గ్రిడ్స్ ఇండియా సంస్థే రూపొందించింది. హైదరాబాద్‌ కేంద్రంగా ఈ కంపెనీ పనిచేస్తోంది. ఏపీ ప్రభుత్వం వద్ద మాత్రమే రహస్యంగా ఉండాల్సిన ప్రజల డేటా మొత్తం ఈ ఐటీ గ్రిడ్స్‌ సంస్థ వద్ద ఉంది.

ఈ డేటాలో ప్రజల ఆధార్‌ కార్డు వివరాలతో పాటు వ్యక్తిగత వివరాలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్దంగా ఒక ప్రైవేట్ సంస్థ వద్ద ప్రజల వివరాలు ఉండడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పోలీసులకు, ఈసీకి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌ కేంద్రంగా ఈ కంపెనీ పనిచేస్తుండడంతో సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు రంగంలోకి దిగి కూపీ లాగుతున్నారు.

ఈ విషయం తెలుసుకున్న టీడీపీ ఉలిక్కిపడింది. కంపెనీ ప్రతినిధులను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకోగా.. వెంటనే గుంటూరు పోలీసులను హైదరాబాద్‌ పంపారు. ఐటీ గ్రిడ్స్‌ కంపెనీ యాజమాన్యం తన ఉద్యోగులు కనిపించడం లేదంటూ హైదరాబాద్ పోలీసులకు కాకుండా… ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేయడం విశేషం. అరెస్ట్ చేసిన వారిని తమకు అప్పగించాలని కోరారు. ఇందుకు తెలంగాణ పోలీసులు నిరాకరించారు.

డేటా చోరీ కేసులో వీరిని లోతుగా విచారించాల్సి ఉందని స్పష్టం చేశారు. నేరం జరిగింది హైదరాబాద్‌లో కాబట్టి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. ఐటీ గ్రిడ్స్ ఇండియా కంపెనీ కార్యాలయాన్ని తెలంగాణ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ సేవా మిత్రా యాప్‌ సాయంతోనే విపక్షాల ఓట్లను తొలిస్తున్నట్టు చెబుతున్నారు.

First Published:  2 March 2019 9:17 PM GMT
Next Story