Telugu Global
NEWS

జగన్‌ వల్లే మనకు ప్రాధాన్యం : దేశం బీసీ నేతలు

బీసీల పార్టీగా చెప్పుకుంటున్న తెలుగుదేశం ఇన్నాళ్లు తమను వాడుకుంది తప్ప ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చలేదని తెలుగుదేశం బీసీ నాయకులు పశ్చాతాప పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత నేత ఎన్.టి. రామారావు ఉన్నంత వరకూ తెలుగుదేశం పార్టీలో బిసీ, ఎసీ, ఎస్టీ, మైనారిటీలకు ఎంతో ప్రధాన్యం ఇచ్చారని వారంటున్నారు. చంద్రబాబు నాయుడు ఆదీనంలోకి తెలుగుదేశం పార్టీ రాగానే ఈ వర్గాలపై సవతి తల్లి ప్రేమ చూపించారని తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు. తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్‌లోను […]

జగన్‌ వల్లే మనకు ప్రాధాన్యం : దేశం బీసీ నేతలు
X

బీసీల పార్టీగా చెప్పుకుంటున్న తెలుగుదేశం ఇన్నాళ్లు తమను వాడుకుంది తప్ప ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చలేదని తెలుగుదేశం బీసీ నాయకులు పశ్చాతాప పడుతున్నారు.

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత నేత ఎన్.టి. రామారావు ఉన్నంత వరకూ తెలుగుదేశం పార్టీలో బిసీ, ఎసీ, ఎస్టీ, మైనారిటీలకు ఎంతో ప్రధాన్యం ఇచ్చారని వారంటున్నారు. చంద్రబాబు నాయుడు ఆదీనంలోకి తెలుగుదేశం పార్టీ రాగానే ఈ వర్గాలపై సవతి తల్లి ప్రేమ చూపించారని తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు.

తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్‌లోను కూడా చంద్రబాబు నాయుడు బీసీల పట్ల చిన్న చూపు చూసారని వారు అభిప్రాయపడుతున్నారు.

ఇటీవల తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికలలో బీసీలు తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారని, అందుకే ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తుడిచి పెట్టుకుపోయిందని అభిప్రాయపడుతున్నారు.

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బీసీ గర్జనతో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు వాస్తవ పరిస్థితులు తెలిసాయని అంటున్నారు. రానున్న ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్‌లో బీసీలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలబడతారనే భయం చంద్రబాబులో రోజురోజుకు పెరుగుతోందని తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు చెబుతున్నారు.

చంద్రబాబు నాయుడు తన సామాజిక వర్గానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని, ఈ అంశాన్ని కూడా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ సా‌క్ష్యాలతో సహా బయటపెట్టిందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డికి బీసీలలో ఆదరణ పెరగడం వల్లే ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయ పడుతున్నారు.

రానున్న ఎన్నికలలో చంద్రబాబు నాయుడిని దూరం పెట్టి జగన్ కి మద్దతు పలకాలని లోపాయికారిగా బీసీ సంఘాలకు బీసీ తెలుగు తమ్ముళ్లు ప్రచారం చేస్తున్నారు.

First Published:  2 March 2019 11:03 PM GMT
Next Story