Telugu Global
NEWS

 ప్రజలకే కాదు... కాంగ్రెస్ నేతలకు దక్కలేదు భరోసా...!?

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి అసలు విషయం బోధపడింది. గడచిన నాలుగున్నర సంవత్సరాలుగా ఏపీ ప్రజల కోపానికి, ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ పార్టీ పెద్దలు భరోసా యాత్ర తో వారిలో నమ్మకం కలిగించాలని చేసిన ప్రయత్నం ఫలించలేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి చేపట్టిన భరోసా బస్సు యాత్ర ఆదివారం సాయంత్రంతో ముగుస్తుంది. అనంతపురం జిల్లాలోని రఘువీరారెడ్డి సొంత గ్రామం లో ప్రారంభమైన ఈ బస్సు యాత్ర ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లోనూ పర్యటించింది. తిరుపతి, నెల్లూరు, […]

 ప్రజలకే కాదు... కాంగ్రెస్ నేతలకు దక్కలేదు భరోసా...!?
X

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి అసలు విషయం బోధపడింది. గడచిన నాలుగున్నర సంవత్సరాలుగా ఏపీ ప్రజల కోపానికి, ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ పార్టీ పెద్దలు భరోసా యాత్ర తో వారిలో నమ్మకం కలిగించాలని చేసిన ప్రయత్నం ఫలించలేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి చేపట్టిన భరోసా బస్సు యాత్ర ఆదివారం సాయంత్రంతో ముగుస్తుంది.

అనంతపురం జిల్లాలోని రఘువీరారెడ్డి సొంత గ్రామం లో ప్రారంభమైన ఈ బస్సు యాత్ర ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లోనూ పర్యటించింది. తిరుపతి, నెల్లూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల మీదుగా శ్రీకాకుళం బయలుదేరిన ఈ భరోసా యాత్ర దాదాపు మూడు వేల కిలోమీటర్లు పర్యటించింది అని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. 100 శాసనసభా నియోజకవర్గాలకు పైగా బస్సు యాత్ర సాగింది.

తిరుపతిలో జరిగిన బస్సు యాత్రలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆ బహిరంగ సభ నిరాశపరిచింది. రాహుల్ గాంధీ ప్రసంగంలో ఏమాత్రం కొత్తదనం లేకపోవడంతో పాటు రఘువీరా రెడ్డి చేసిన అనువాదం కూడా సభకు వచ్చిన వారిని ఆకట్టుకోలేకపోయింది.

అనేక జిల్లాల్లో సాగిన ఈ బస్సు యాత్ర రఘువీరారెడ్డి పసలేని ప్రసంగాలతో ముందుకు సాగింది. బస్సు యాత్రతో ఆంధ్రప్రదేశ్ లో పూర్వవైభవం రాకపోయినా… ప్రత్యేక హోదా హామీతో కనీసం ప్రజల లోనేనా సానుభూతి వస్తుందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు భావించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మాట దేవుడెరుగు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా ఈ భరోసా యాత్ర ఎలాంటి భరోసా ఇవ్వలేదని ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు చెబుతున్నారు.

రైతు భరోసా యాత్ర జరుగుతుండగానే కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోనూ ఇటు తెలుగుదేశం పార్టీలోనూ చేరిపోయారు. దీంతో భరోసా యాత్ర ప్రజల లోనే కాకుండా నాయకుల్లో కూడా ఎలాంటి ధైర్యాన్ని నింపే లేదని విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ బస్సు యాత్ర పై పూర్తి స్థాయి నివేదిక ఇస్తామంటూ ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి చెప్పారని, అలాంటి నివేదికలు ఏవీ అవసరం లేదంటూ రాహుల్ గాంధీ సుతిమెత్తగా తిరస్కరించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చేపట్టిన భరోసా యాత్ర పూర్తి స్థాయిలో విఫలమైందని రాహుల్ గాంధీ కూడా ఓ నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

First Published:  3 March 2019 12:02 AM GMT
Next Story