మళ్లీ దర్శకుడిగా మారిన అవసరాల
నటుడు అవసరాల శ్రీనివాస్ మళ్లీ దర్శకుడిగా మారాడు. కొత్త సినిమా ప్రకటించాడు. నాగశౌర్య హీరోగా మార్చి నుంచి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు అవసరాల. ఈ మేరకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. దర్శకుడిగా వరుసగా నాగశౌర్యతోనే సినిమాలు చేస్తున్నాడు అవసరాల. తన తొలి సినిమా ఊహలు గుసగుసలాడేలో నాగశౌర్యనే హీరోగా తీసుకున్న అవసరాల, రెండో సినిమా జ్యో అచ్యుతానందలో కూడా నాగశౌర్యను రిపీట్ చేశాడు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కూడా అతడితోనే […]
నటుడు అవసరాల శ్రీనివాస్ మళ్లీ దర్శకుడిగా మారాడు. కొత్త సినిమా ప్రకటించాడు. నాగశౌర్య హీరోగా మార్చి నుంచి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు అవసరాల. ఈ మేరకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది.
దర్శకుడిగా వరుసగా నాగశౌర్యతోనే సినిమాలు చేస్తున్నాడు అవసరాల. తన తొలి సినిమా ఊహలు గుసగుసలాడేలో నాగశౌర్యనే హీరోగా తీసుకున్న అవసరాల, రెండో సినిమా జ్యో అచ్యుతానందలో కూడా నాగశౌర్యను రిపీట్ చేశాడు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కూడా అతడితోనే కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు..
ఈ ప్రాజెక్టులో మాళవిక నాయర్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. గతంలో నాగశౌర్య, మాళవిక కలిసి కల్యాణ వైభోగమే అనే సినిమా చేశారు. వీళ్లిద్దరి కాంబోలో ఇది రెండో మూవీ. ఈ ప్రాజెక్టు మరో 10 రోజుల్లో సెట్స్ పైకి వెళ్లబోతోంది. మిగతా వివరాల్ని అప్పుడు ప్రకటిస్తారు.