Telugu Global
Cinema & Entertainment

బన్నీ సరసన మరోసారి క్యాథరీన్

బన్నీ-క్యాథరీన్ మధ్య మంచి బాండింగ్ ఉంది. ఆఫ్ స్క్రీన్ కూడా వీళ్లిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. అందుకే అవకాశం దొరికినప్పుడల్లా క్యాథరీన్ కు తన సినిమాల్లో అవకాశమిస్తుంటాడు బన్నీ. ఇలా వీళ్లిద్దరూ కలిసి ఇప్పటివరకు సరైనోడు, ఇద్దరమ్మాయిలతో, రుద్రమదేవి సినిమాల్లో కలిసి నటించారు. ఇప్పుడు వరుసగా నాలుగో సినిమా వీళ్లిద్దరి కాంబోలో రెడీ అవుతోంది. అవును.. త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ చేయబోతున్న సినినిమాలో క్యాథరీన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. కాకపోతే క్యాథరీన్ మెయిన్ హీరోయిన్ కాదు. సెకెండ్ […]

బన్నీ సరసన మరోసారి క్యాథరీన్
X

బన్నీ-క్యాథరీన్ మధ్య మంచి బాండింగ్ ఉంది. ఆఫ్ స్క్రీన్ కూడా వీళ్లిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. అందుకే అవకాశం దొరికినప్పుడల్లా క్యాథరీన్ కు తన సినిమాల్లో అవకాశమిస్తుంటాడు బన్నీ. ఇలా వీళ్లిద్దరూ కలిసి ఇప్పటివరకు సరైనోడు, ఇద్దరమ్మాయిలతో, రుద్రమదేవి సినిమాల్లో కలిసి నటించారు. ఇప్పుడు వరుసగా నాలుగో సినిమా వీళ్లిద్దరి కాంబోలో రెడీ అవుతోంది.

అవును.. త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ చేయబోతున్న సినినిమాలో క్యాథరీన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. కాకపోతే క్యాథరీన్ మెయిన్ హీరోయిన్ కాదు. సెకెండ్ హీరోయిన్ గా ఆమెను ఎంపిక చేశారు. ఫస్ట్ హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫిక్స్ చేయలేదు.

ఈ నెలాఖరుకు ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. హారిక-హాసిని, గీతాఆర్ట్స్ బ్యానర్లపై నిర్మితం కానున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందించబోతున్నారు. సన్నాఫ్ సత్యమూర్తి, అత్తారింటికి దారేది సినిమాల టైపులో హార్ట్ టచింగ్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రాబోతోంది.

First Published:  2 March 2019 11:30 PM GMT
Next Story