Telugu Global
NEWS

జగన్‌ కోరితే నేను సిద్ధం " ఓవైసీ

ఏపీలో వైసీపీకే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. ఏపీలో మైనార్టీలంతా వైసీపీతోనే ఉన్నారని అసద్ వ్యాఖ్యానించారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీలను భూస్థాపితం చేయాలన్నారు. జగన్ అడిగితే ఏపీలో వైసీపీ తరపున ప్రచారం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. టీఆర్ఎస్, వైసీపీలు 35 ఎంపీ సీట్లను గెలిస్తే జాతీయ రాజకీయాలను శాసించే అవకాశం ఉంటుందన్నారు. పాకిస్థాన్‌ పైనా అసద్ మండిపడ్డారు. పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ అణుబాంబుల గురించి మాట్లాడుతున్నార‌ని, ఆ బాంబులు […]

జగన్‌ కోరితే నేను సిద్ధం  ఓవైసీ
X

ఏపీలో వైసీపీకే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. ఏపీలో మైనార్టీలంతా వైసీపీతోనే ఉన్నారని అసద్ వ్యాఖ్యానించారు.

దేశంలో కాంగ్రెస్, బీజేపీలను భూస్థాపితం చేయాలన్నారు. జగన్ అడిగితే ఏపీలో వైసీపీ తరపున ప్రచారం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు.

టీఆర్ఎస్, వైసీపీలు 35 ఎంపీ సీట్లను గెలిస్తే జాతీయ రాజకీయాలను శాసించే అవకాశం ఉంటుందన్నారు.

పాకిస్థాన్‌ పైనా అసద్ మండిపడ్డారు. పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ అణుబాంబుల గురించి మాట్లాడుతున్నార‌ని, ఆ బాంబులు తమ దేశం వద్ద కూడా ఉన్నాయ‌న్నారు. ల‌ష్క‌రే సైతాన్‌, జైషే సైతాన్‌ల‌ను నియంత్రించాల‌న్నారు. అప్పుడే దేశాలు బాగుపడుతాయన్నారు అసద్.

First Published:  2 March 2019 4:17 AM GMT
Next Story