Telugu Global
International

యూఎస్ శరణార్థి శిబిరాల్లో 4,500 మంది చిన్నారులపై లైంగిక వేధింపులు

అమెరికా న్యాయశాఖ గత వారం వెల్లడించిన విషయం వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. శరణార్థులుగా అమెరికా శిబిరాల్లో తలదాచుకుంటున్న చిన్నారులు, మైనర్లపై అక్కడి అధికారులు లైంగిక దాడులకు పాల్పడ్డారని ఒక నివేదికలో వెల్లడైంది. దాదాపు 4500 మంది ఇలా తమపై లైంగిక వేధింపులు జరిగాయంటూ పిర్యాదులు చేశారు. ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడుస్తున్న ఈ శిబిరాల్లో అత్యంత ప్రమాదకర పరిస్థితులు నెలకొనడం నివ్వెరపరుస్తోంది. ఆ దేశంలోనికి ఒంటరిగా ప్రవేశించిన, ట్రంప్ తీసుకొచ్చిన ఒక పాలసీ వల్ల తల్లిదండ్రుల నుంచి […]

యూఎస్ శరణార్థి శిబిరాల్లో 4,500 మంది చిన్నారులపై లైంగిక వేధింపులు
X

అమెరికా న్యాయశాఖ గత వారం వెల్లడించిన విషయం వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. శరణార్థులుగా అమెరికా శిబిరాల్లో తలదాచుకుంటున్న చిన్నారులు, మైనర్లపై అక్కడి అధికారులు లైంగిక దాడులకు పాల్పడ్డారని ఒక నివేదికలో వెల్లడైంది. దాదాపు 4500 మంది ఇలా తమపై లైంగిక వేధింపులు జరిగాయంటూ పిర్యాదులు చేశారు. ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడుస్తున్న ఈ శిబిరాల్లో అత్యంత ప్రమాదకర పరిస్థితులు నెలకొనడం నివ్వెరపరుస్తోంది.

ఆ దేశంలోనికి ఒంటరిగా ప్రవేశించిన, ట్రంప్ తీసుకొచ్చిన ఒక పాలసీ వల్ల తల్లిదండ్రుల నుంచి వేరు చేయబడిన వేలాది మంది మైనర్లను ఈ శరణార్థి శిబిరాల్లో ఉంచారు. అక్కడ పని చేసే సిబ్బంది వారిని లైంగికంగా వేధించడం, అసభ్యంగా తాకడం, అత్యాచారాలకు పాల్పడటం, స్నానం చేస్తున్నప్పుడు చూడటం వంటి ఘటనలకు పాల్పడ్డారని తెలుస్తోంది. కేవలం సిబ్బందే కాక ఇతర మైనర్లు కూడా కొంత మంది చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడ్డట్లు వెల్లడైంది.

అక్టోబర్ 2014 నుంచి జులై 2018 మధ్యలో ఇలాంటి ఘటనలకు సంబంధించి 4,556 పిర్యాదులు వచ్చాయి. వీటిలో 1,303 పిర్యాదులను న్యాయ శాఖకు పంపించారు. ఈ 1,303 కేసులు అత్యంత తీవ్రమైనవిగా పరిగణించారు. మరో 178 పిర్యాదులు సిబ్బంది చేసిన ఆకృత్యాలను వెలుగులోనికి తెచ్చాయి.

ఈ ఘటనలపై సంబంధిత శాఖ డైరెక్టర్ జోనాథాన్ హేస్ స్పందిస్తూ…. మా శాఖకు చెందిన సిబ్బంది ఎవరూ ఇలాంటి దారుణాలకు పాల్పడలేదని వెనకేసుకొచ్చారు. అయితే ఈ పిర్యాదులపై పారదర్శకంగా విచారణ జరుపుతున్నామని.. ఎవరైనా దోషిగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

2015 ఏప్రిల్‌లో షికాగో డిటెన్షన్ సెంటర్‌కు చెందిన ఒక ఉద్యోగి ఒక చిన్నారిని ముద్దు పెట్టుకొని, అసభ్యంగా ప్రవర్తించినందుకు క్రిమినల్ కేసు నమోదు చేశారు. అయితే అతడు దోషిగా తేలాడా లేదా అనేది ఇంత వరకు తెలియరాలేదు.

మరోవైపు ఈ నాలుగేళ్లలో జరిగిన ఈ ఘటనలకు సంబంధించి రూపొందించిన ఒక రిపోర్టులో పలు విషయాలు వెల్లడయ్యాయి. ఆక్సియస్ అనే ఏజెన్సీ రూపొందించిన ఈ రిపోర్టులో 859 కంప్లైంట్లు కేవలం 2018 మార్చి నుంచి 2018 జులై మధ్య అంటే 5 నెలల వ్యవధిలో వచ్చాయి. వీటిలో 342 పిర్యాదులను న్యాయశాఖకు బదిలీ చేశారు.

First Published:  1 March 2019 9:27 PM GMT
Next Story