Telugu Global
Cinema & Entertainment

వంశీని టెన్షన్ పెడుతున్న మహర్షి

సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోని డైరెక్ట్ చెయ్యడానికి అవకాశం వస్తే ఏ డైరెక్టర్ అయినా చాలా హ్యాపి గా ఫీల్ అవుతాడు. అలాగే ప్రస్తుతం మహేష్ బాబు తో “మహర్షి” సినిమాని డైరెక్ట్ చేస్తున్న వంశీ కూడా అలాగే ఫీల్ అయ్యాడు మొదట్లో. కానీ ఇప్పుడు మాత్రం వంశీ పైడిపల్లికి పూర్తిగా వేరుగా ఉందట. ఎందుకంటే సినిమా రిలీజ్ డేట్ దగ్గరకి వస్తుంది కానీ ఇంకా చాలా వరకు షూటింగ్ బ్యాలెన్స్ ఉండి […]

వంశీని టెన్షన్ పెడుతున్న మహర్షి
X

సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోని డైరెక్ట్ చెయ్యడానికి అవకాశం వస్తే ఏ డైరెక్టర్ అయినా చాలా హ్యాపి గా ఫీల్ అవుతాడు. అలాగే ప్రస్తుతం మహేష్ బాబు తో “మహర్షి” సినిమాని డైరెక్ట్ చేస్తున్న వంశీ కూడా అలాగే ఫీల్ అయ్యాడు మొదట్లో.

కానీ ఇప్పుడు మాత్రం వంశీ పైడిపల్లికి పూర్తిగా వేరుగా ఉందట. ఎందుకంటే సినిమా రిలీజ్ డేట్ దగ్గరకి వస్తుంది కానీ ఇంకా చాలా వరకు షూటింగ్ బ్యాలెన్స్ ఉండి పోయింది. దిల్ రాజు మాత్రం షూటింగ్ గురించి అస్సలు పట్టించుకోకుండా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేసాడట.

ఇక్కడేమో వంశీ పైడిపల్లి పూరి జగన్నాధ్ లా ఫాస్ట్ గా పని చెయ్యకుండా సుకుమార్ లాగ చాలా నెమ్మదిగా సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతానికి అయితే ఏకధాటిగా కొన్ని టెన్షన్స్ మధ్య షూటింగ్ ని జరుపుతున్నాడు వంశీ పైడిపల్లి.

మరోవైపు ఫ్యాన్స్ కూడా వంశీతో సినిమా టైం కి రావాలని ఒత్తిడి పెడుతున్నారట. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఏప్రిల్ 25 న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

First Published:  1 March 2019 5:30 AM GMT
Next Story