Telugu Global
International

పవన్‌ చేసిన వ్యాఖ్యలపై పాక్‌ మీడియా కథనాలు

ఎన్నికల ముందు యుద్ధాలు వస్తాయని గతంలో చెప్పేవారని… ఇప్పుడు చూస్తున్నానంటూ జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను పాకిస్థాన్‌ మీడియా ప్రస్తావించింది. కేవలం ఎన్నికల కోసమే పాక్‌తో యుద్ధానికి మోడీ కాలుదువ్వుతున్నారని ఆరోపిస్తున్న పాకిస్థాన్‌కు…. భారత్‌లో కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అస్త్రంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్ వ్యాఖ్యలను పాకిస్థాన్‌కు చెందిన డాన్‌ పత్రిక వెబ్‌సైట్‌ ప్రచురించింది. ఎన్నికలకు ముందు యుద్ధం వస్తుందని తనకు రెండేళ్ల క్రితమే తెలుసని… దీన్ని బట్టే దేశంలో పరిస్థితి […]

పవన్‌ చేసిన వ్యాఖ్యలపై పాక్‌ మీడియా కథనాలు
X

ఎన్నికల ముందు యుద్ధాలు వస్తాయని గతంలో చెప్పేవారని… ఇప్పుడు చూస్తున్నానంటూ జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను పాకిస్థాన్‌ మీడియా ప్రస్తావించింది. కేవలం ఎన్నికల కోసమే పాక్‌తో యుద్ధానికి మోడీ కాలుదువ్వుతున్నారని ఆరోపిస్తున్న పాకిస్థాన్‌కు…. భారత్‌లో కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అస్త్రంగా మారుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే పవన్ వ్యాఖ్యలను పాకిస్థాన్‌కు చెందిన డాన్‌ పత్రిక వెబ్‌సైట్‌ ప్రచురించింది. ఎన్నికలకు ముందు యుద్ధం వస్తుందని తనకు రెండేళ్ల క్రితమే తెలుసని… దీన్ని బట్టే దేశంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చంటూ పవన్‌ చేసిన వ్యాఖ్యలను డాన్‌ పత్రిక ప్రచురించింది.

పరోక్షంగా ఎన్నికల కోసమే పాక్‌పై దాడికి మోడీ ప్రయత్నిస్తున్నారన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ వ్యాఖ్యలను భారత్‌లోని నేతలు కూడా సమర్ధిస్తున్నారని చాటుకునేందుకు డాన్ పత్రిక ప్రయత్నించింది.

Next Story