Telugu Global
National

స్వార్ధం కోసం దేశాన్ని కించపరుస్తున్నారు : మోదీ

“ఆంధ్రప్రదేశ్ లో కొందరు నాయకులు తమ స్వార్ధం కోసం, అధికారం కోసం ఏ పనైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. వారు తమ స్వార్ధం కోసం దేశాన్ని కూడా కించపరిచేందుకు వెనుకాడడం లేదు” అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడ్ని ఉద్దేశించి పరోక్షంగా విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రాజధాని విశాఖపట్నంలో జరిగిన బహిరంగ సభలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై, కొన్ని రాజకీయ పార్టీలు దేశరక్షణపై చేస్తున్న వ్యాఖ్యలపట్ల ఆగ్రహం వ్యక్తం చేసారు. పూల్వామాలో […]

స్వార్ధం కోసం దేశాన్ని కించపరుస్తున్నారు : మోదీ
X

“ఆంధ్రప్రదేశ్ లో కొందరు నాయకులు తమ స్వార్ధం కోసం, అధికారం కోసం ఏ పనైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. వారు తమ స్వార్ధం కోసం దేశాన్ని కూడా కించపరిచేందుకు వెనుకాడడం లేదు” అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడ్ని ఉద్దేశించి పరోక్షంగా విరుచుకుపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రాజధాని విశాఖపట్నంలో జరిగిన బహిరంగ సభలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై, కొన్ని రాజకీయ పార్టీలు దేశరక్షణపై చేస్తున్న వ్యాఖ్యలపట్ల ఆగ్రహం వ్యక్తం చేసారు. పూల్వామాలో సైనికులపై దాడి అనంతరం జరిగిన పరిణామాలపై విశాఖ సభలో ప్రధాని ప్రస్తావించారు. ఉగ్రవాదుల దాడిలో పాకిస్తాన్ ప్రమేయం ఉందని, దేశప్రజలందరూ భావిస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాయకులు కొందరు పాకిస్తాన్‌కు మద్దతుగా మాట్లాడారని, ఇది ఎంతో విచారకరమని ప్రధాని వ్యాఖ్యానించారు.

“పాకిస్తాన్‌కు అనుకూలంగా…. మన సైనికులకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ పార్లమెంటులో చర్చించుకున్నారు. ఇది ఇక్కడి నాయకుల దేశభక్తి” అని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్దాయిలో విరుచుకుపడ్డారు.

ప్రపంచ దేశాలన్నీ పాకిస్తాన్‌ను, ఆదేశ చర్యలను విమర్శించి ఏకాకిని చేశారని, అయితే ఆంధ్రప్రదేశ్‌ నాయకులు కొందరు పాకిస్తాన్‌కు అనుకూలంగా వ్యాఖ్యానించడం బాధాకరమని ప్రధాని వ్యాఖ్యానించారు. పాపం చేసిన వారు దేనికైనా భయపడతారని, ఆ భయం ఆంధ్రప్రదేశ్‌ నాయకులలో కనిపిస్తోందని అన్నారు.

దేశంలో సుస్ధిర పాలనను అందిస్తున్న తమ ప్రభుత్వాన్ని పడగొట్టి అస్ధిరత్వాన్ని తీసుకు వచ్చే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇక్కడి నాయకులు తమ ప్రయాత్నాలు చేస్తున్నారని ప్రధాని మండిపడ్డారు.

దశాబ్దాల తరబడి పెండింగ్‌లో ఉన్న విశాఖ రైల్వే జోన్‌ను తాము ఏర్పాటు చేశామని…. దాన్ని కూడా తమ స్వార్దం కోసం స్దానిక నాయకులు విమర్శించడం అన్యాయమని ప్రధాని అన్నారు.

First Published:  1 March 2019 10:51 AM GMT
Next Story