Telugu Global
Cinema & Entertainment

రాజమౌళిని కాకా పడుతున్న తమన్నా

స్టార్ హీరోయిన్ అయిన తమన్నా కి ప్రస్తుతం చేతిలో సరైన ఆఫర్స్ లేవు. ప్రస్తుతం ఈ భామ చేతిలో “దట్ ఇస్ మహాలక్ష్మి” అనే సినిమా మాత్రమే ఉంది. బాలీవుడ్ “క్వీన్” సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత తమన్నా “సై రా” సినిమాలో ఒక చిన్న పాత్రలో నటిస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం తమన్నా రాజమౌళి ని కాకా పట్టే పనిలో పడింది. ఎందుకంటే […]

రాజమౌళిని కాకా పడుతున్న తమన్నా
X

స్టార్ హీరోయిన్ అయిన తమన్నా కి ప్రస్తుతం చేతిలో సరైన ఆఫర్స్ లేవు. ప్రస్తుతం ఈ భామ చేతిలో “దట్ ఇస్ మహాలక్ష్మి” అనే సినిమా మాత్రమే ఉంది. బాలీవుడ్ “క్వీన్” సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత తమన్నా “సై రా” సినిమాలో ఒక చిన్న పాత్రలో నటిస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం తమన్నా రాజమౌళి ని కాకా పట్టే పనిలో పడింది.

ఎందుకంటే రాజమౌళి తన తదుపరి సినిమా రామ్ చరణ్, ఎన్టీఆర్ లని హీరోలుగా పెట్టి “ఆర్.ఆర్.ఆర్” చేస్తున్నాడనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఎలాగైనా అవకాశం కొట్టేయాలని తమన్నా తెగ ట్రై చేస్తుందట.

గతం లో రాజమౌళి తమన్నా కి “బాహుబలి” సిరీస్ లో అవాకాశం ఇచ్చినప్పుడు తమన్నా ఎగిరిగంతేసింది. ఇక ఇప్పుడు కూడా తనని “ఆర్.ఆర్.ఆర్” లో తప్పకుండా తీసుకుంటున్నాడనే ధీమాతో తమన్నా ఉంది.

అందుకోసం రాజమౌళి దగ్గర అవకాశం కోసం పడరాని పాట్లు పడుతుందట ఈ భామ. మరి “ఆర్.ఆర్.ఆర్” లో తమన్నా కి రాజమౌళి అవకాశం ఇస్తాడో లేదో చూడాలి.

First Published:  28 Feb 2019 1:25 AM GMT
Next Story