Telugu Global
NEWS

చంద్రబాబుకు ప్రధాని మోడీ ఝలక్?

ఇన్నాళ్లూ తనకు మాత్రమే రాజకీయాలు తెలుసునని, తాను మాత్రమే అందరి కంటే సీనియర్ నాయకుడినని బీరాలు పోయే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద ఝలక్ ఇచ్చారు. విశాఖకు రైల్వే జోన్ ప్రకటిస్తారని రెండు రోజులు ముందుగానే తెలుసుకున్న చంద్రబాబు నాయుడు ” విశాఖకు రైల్వే జోన్ ప్రకటించండి”  అంటూ రైల్వే మంత్రి పియూష్ గోయల‌్ కు లేఖ రాశారు. ఆ లేఖ రాసిన మర్నాడే రైల్వే మంత్రి విశాఖకు […]

చంద్రబాబుకు ప్రధాని మోడీ ఝలక్?
X

ఇన్నాళ్లూ తనకు మాత్రమే రాజకీయాలు తెలుసునని, తాను మాత్రమే అందరి కంటే సీనియర్ నాయకుడినని బీరాలు పోయే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద ఝలక్ ఇచ్చారు. విశాఖకు రైల్వే జోన్ ప్రకటిస్తారని రెండు రోజులు ముందుగానే తెలుసుకున్న చంద్రబాబు నాయుడు ” విశాఖకు రైల్వే జోన్ ప్రకటించండి” అంటూ రైల్వే మంత్రి పియూష్ గోయల‌్ కు లేఖ రాశారు. ఆ లేఖ రాసిన మర్నాడే రైల్వే మంత్రి విశాఖకు రైల్వే జోన్ ప్రకటించారు.

నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాచిక పారి ఉంటే ఈ పాటికే ఇది నా గొప్పతనమే అంటూ చంద్రబాబు నాయుడు, ఆయన వందిమాగదులు, తెలుగు తమ్ముళ్లు ఊకదంపుడు ప్రకటనలు ఇచ్చేసే వారు. అంతే కాదు… వారి పచ్చ మీడియాలో చెలరేగిపోయే వారు. అయితే, ప్రధాని నరేంద్ర మోడీ రైల్వే జోన్ ఇచ్చినట్టే ఇచ్చి చంద్రబాబు నాయుడి కోరలు కూడా పీకేశారు. అదెలాగంటే… విశాఖ రైల్వే జోన్ కు ఒడిశాను కూడా కొంత కలిపారు. దీంతో అసలు ఒడిశాకు…. కొసరు ఆంధ్రాకు అన్నట్లుగా తయారైంది పరిస్థితి.

కొత్తగా ఏర్పాటు చేస్తున్న విశాఖ రైల్వే జోన్ కు ‘సౌత్ కోస్ట్ రైల్వే జోన్’ గా నామకరణం కూడా చేసేశారు. ఈ కొత్త రైల్వే జోన్ లోకి విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లను కలిపారు. దీంతో పాటు ఒడిసాలోని మరికొన్ని డివిజన్లను కూడా కలిపి ఈ కొత్త విశాఖ రైల్వే జోన్ కు శ్రీకారం చుట్టింది కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్.

ఈ డివిజన్ల విలీనంతో ఏర్పడిన విశాఖ రైల్వే జోన్ లో సరుకు రవాణ వంటి ప్రధాన ఆదాయం ఒడిశాకు వెళ్తుంది. ప్రయాణీకుల ఆదాయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వస్తుంది. అంటే పది వేల కోట్లు ఒడిశాకు వస్తే… ప్రయాణీకుల ద్వారా ఐదు వందల కోట్లు ఆంధ్రప్రదేశ్ కు వస్తుంది అన్నమాట. ఈ విలీన ప్రక్రియ కారణంగా అడగకుండానే అన్నం పెట్టిన చందంగా ఒడిశా ఉంటే… అడిగి వాతలు పెట్టించుకున్న తీరు ఆంధ్రప్రదేశ్ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

నిజానికి ఈ రైల్వే జోన్ ప్రకటన ఇప్పుడు చేయడానికి కారణం చంద్రబాబు నాయుడిని రాజకీయంగా దెబ్బ కొట్టేందుకే అని వారంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడి పరిస్థితి కక్కలేక… మింగలేక అన్నట్లుగా మారింది. తాను రాసిన లేఖ వల్లే విశాఖ రైల్వే జోన్ వచ్చిందని చెప్పలేక… తన మీద కక్షతో ఒడిశాకు ఎక్కువ ఆదాయం వచ్చేలా రైల్వే జోన్ ప్రకటించారని అంగీకరించలేక చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ వ్యూహంలో… ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహంలో పడి గిలగిలాకొట్టుకుంటున్నారని అంటున్నారు.

First Published:  27 Feb 2019 9:40 PM GMT
Next Story