Telugu Global
Cinema & Entertainment

లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్...

ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో ఈ సినిమాకు కొనసాగింపుగా రాబోతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా కోసం ఆడియన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఆ ముహూర్తాన్ని రామ్ గోపాల్ వర్మ ప్రకటించాడు. మార్చి 22న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్టు ప్రకటించాడు వర్మ. ఎన్టీఆర్-మహానాయకుడు సినిమాలో కేవలం నాదెండ్ల ఎపిసోడ్ ను మాత్రమే చూపించారు. ఎన్టీఆర్ తిరిగి అధికారాన్ని హస్తగతం చేసుకోవడంతో ఆ సినిమా ముగుస్తుంది. సరిగ్గా ఆ సినిమా ఎక్కడ ముగిసిందో, […]

లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్...
X

ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో ఈ సినిమాకు కొనసాగింపుగా రాబోతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా కోసం ఆడియన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఆ ముహూర్తాన్ని రామ్ గోపాల్ వర్మ ప్రకటించాడు. మార్చి 22న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్టు ప్రకటించాడు వర్మ.

ఎన్టీఆర్-మహానాయకుడు సినిమాలో కేవలం నాదెండ్ల ఎపిసోడ్ ను మాత్రమే చూపించారు. ఎన్టీఆర్ తిరిగి అధికారాన్ని హస్తగతం చేసుకోవడంతో ఆ సినిమా ముగుస్తుంది. సరిగ్గా ఆ సినిమా ఎక్కడ ముగిసిందో, అక్కడ్నుంచే లక్ష్మీస్ ఎన్టీఆర్ మొదలుకాబోతోంది. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించిన తర్వాత జరిగిన ఘటనలు, ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన ఉదంతం, సొంత కుటుంబంలోనే కన్న కొడుకులు ఎన్టీఆర్ ను నీచంగా చూసిన పర్వం అన్నీ లక్ష్మీస్ ఎన్టీఆర్ లో ఉండబోతున్నాయి.

మరోవైపు ఈ సినిమా బిజినెస్ పై కూడా యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ కు సంబందించి ఇప్పటివరకు మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదంటున్నాడు వర్మ. త్వరలోనే ప్రీ-రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ ను బయటపెడతామని ప్రకటించాడు. అన్నట్టు ఈ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయింది. మరో వారం రోజుల్లో సెన్సార్ కు వెళ్లబోతున్నారు.

First Published:  28 Feb 2019 8:19 AM GMT
Next Story