Telugu Global
International

నన్ను బాగానే చూసుకుంటున్నారు... పైలట్ అభినందన్‌ ఇంటర్వ్యూ

పాకిస్థాన్‌ ఆర్మీకి బంధీగా దొరికిన భారత పైలట్‌ అభినందన్‌ ఇంటర్వ్యూను పాకిస్థాన్ విడుదల చేసింది. ఆర్మీ కస్టడీలో ఉన్న అభినందన్‌తో ఒక పాక్‌ చానల్‌కు ఇంటర్వ్యూ ఇప్పించారు. తనను పాకిస్థాన్ ఆర్మీ బాగానే చూసుకుంటోందని వీడియోలో అభినందన్‌ చెప్పారు. స్థానికులు తనపై దాడి చేస్తుండగా పాక్ ఆర్మీ రక్షించిందని అభినందన్ చెప్పారు. కాఫీ తాగుతూ అభినందన్‌ ఈ మాటలు చెబుతున్నట్టు వీడియోలో ఉంది. పాకిస్థాన్ ఆర్మీ ట్రీట్‌మెంట్ బాగానే ఉందన్నారు. భారత్‌ వెళ్లాక కూడా ఇదే చెబుతానని […]

నన్ను బాగానే చూసుకుంటున్నారు... పైలట్ అభినందన్‌ ఇంటర్వ్యూ
X

పాకిస్థాన్‌ ఆర్మీకి బంధీగా దొరికిన భారత పైలట్‌ అభినందన్‌ ఇంటర్వ్యూను పాకిస్థాన్ విడుదల చేసింది. ఆర్మీ కస్టడీలో ఉన్న అభినందన్‌తో ఒక పాక్‌ చానల్‌కు ఇంటర్వ్యూ ఇప్పించారు.

తనను పాకిస్థాన్ ఆర్మీ బాగానే చూసుకుంటోందని వీడియోలో అభినందన్‌ చెప్పారు. స్థానికులు తనపై దాడి చేస్తుండగా పాక్ ఆర్మీ రక్షించిందని అభినందన్ చెప్పారు. కాఫీ తాగుతూ అభినందన్‌ ఈ మాటలు చెబుతున్నట్టు వీడియోలో ఉంది.

పాకిస్థాన్ ఆర్మీ ట్రీట్‌మెంట్ బాగానే ఉందన్నారు. భారత్‌ వెళ్లాక కూడా ఇదే చెబుతానని అభినందన్‌ వెల్లడించారు. తాను సురక్షితంగానే ఉన్నానని చెప్పారు.

అయితే ఈ వీడియోపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొలుత అభినందన్ ను రక్తం వచ్చేలా హింసించిన పాక్… ప్రపంచ దేశాల ముందు ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో కొత్త నాటకానికి తెరలేపినట్టు భావిస్తున్నారు.

తాము అభినందన్ ను హింసించడం లేదని ప్రపంచ దేశాలకు చెప్పేందుకు అభినందన్ చేత ఇలా బలవంతంగా ఈ మాటలు చెప్పినట్టు భావిస్తున్నారు.

First Published:  27 Feb 2019 7:45 AM GMT
Next Story