Telugu Global
Cinema & Entertainment

అలా నటించలేదు.... కేవలం స్కిన్ మేక్ అప్ మాత్రమే....

స్టార్ హీరోయిన్ త్రిష సినిమాల్లోకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు కావొస్తుంది. అయినా కూడా ఈ సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. కాకపోతే ఆ సినిమాలు మాత్రం త్రిషకి సక్సెస్ ని ఇవ్వలేకపోతున్నాయి. ఇక ఈ భామ ఇప్పటి వరకు తన కెరీర్ లో గ్లామర్ పాత్రల్లో అయితే నటించింది గాని హాట్ సీన్స్ లో మాత్రం అస్సలు నటించలేదు. కానీ కెరీర్ లో మొట్ట మొదటి సారి త్రిష హాట్ సీన్ లో నటించనుందట. […]

అలా నటించలేదు.... కేవలం స్కిన్ మేక్ అప్ మాత్రమే....
X

స్టార్ హీరోయిన్ త్రిష సినిమాల్లోకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు కావొస్తుంది. అయినా కూడా ఈ సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. కాకపోతే ఆ సినిమాలు మాత్రం త్రిషకి సక్సెస్ ని ఇవ్వలేకపోతున్నాయి.

ఇక ఈ భామ ఇప్పటి వరకు తన కెరీర్ లో గ్లామర్ పాత్రల్లో అయితే నటించింది గాని హాట్ సీన్స్ లో మాత్రం అస్సలు నటించలేదు. కానీ కెరీర్ లో మొట్ట మొదటి సారి త్రిష హాట్ సీన్ లో నటించనుందట. అసలు విషయంలోకి వెళ్తే త్రిష ప్రస్తుతం తమిళ్ లో నాలుగు సినిమాల్లో నటిస్తుంది.

ఈ నాలుగు సినిమాల్లో ఒకటైన “పరంపదం విలయట్టూ” సినిమా లో త్రిష దయ్యం పాత్రలో నటిస్తుంది. ఇక ఈ సినిమాలో అందాల ఆరబోతలో హద్దులు దాటిన ఈ అమ్మడు ఓ సన్నివేశంలో టాప్ లెస్ గా నటించింది అనే టాక్ వినిపిస్తోంది. త్రిష మాత్రం తానేమి టాప్ లెస్ గా నటించలేదని, స్కిన్ మేక్ అప్ వేసుకొని ఆ సీన్ లో నటించానని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాలో త్రిష నిజంగానే టాప్ లెస్ గా నటించిందా? అనేది తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.

First Published:  26 Feb 2019 11:06 PM GMT
Next Story