Telugu Global
Cinema & Entertainment

హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అవుతున్న తమన్, అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మూడో సినిమా రాబోతుంది అనేది అందరికి తెలిసిన విషయమే. ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా జరిగిపోయింది. ఈ సినిమా త్వరలో గ్రాండ్ గా లాంచ్ కానుంది. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన “జులాయి” “సన్ అఫ్ సత్యమూర్తి” మంచి హిట్ అందుకున్నాయి. ఇక ఇప్పుడు రాబోతున్న సినిమా కూడా తప్పకుండా మంచి సినిమా అవుతుందనే నమ్మకంతో అల్లు అర్జున్ అభిమానులు ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ […]

హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అవుతున్న తమన్, అల్లు అర్జున్
X

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మూడో సినిమా రాబోతుంది అనేది అందరికి తెలిసిన విషయమే. ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా జరిగిపోయింది. ఈ సినిమా త్వరలో గ్రాండ్ గా లాంచ్ కానుంది.

వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన “జులాయి” “సన్ అఫ్ సత్యమూర్తి” మంచి హిట్ అందుకున్నాయి. ఇక ఇప్పుడు రాబోతున్న సినిమా కూడా తప్పకుండా మంచి సినిమా అవుతుందనే నమ్మకంతో అల్లు అర్జున్ అభిమానులు ఉన్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ తమన్ ని సంగీత దర్శకుడిగా సెలెక్ట్ చేశాడని తెలుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ కి “అరవింద సమేత” వంటి బెస్ట్ ఆల్బమ్ ని ఇచ్చి ఆ సినిమా హిట్ అవ్వడంలో కీలక పాత్ర పోషించాడు తమన్.

అలాగే అల్లు అర్జున్ కి కూడా “రేసు గుర్రం” “సరైనోడు” వంటి మ్యూజికల్ హిట్స్ ని అందించాడు తమన్. గీత ఆర్ట్స్ పై అల్లు అరవింద్, హారిక హాసిని పై రాధా క్రిష్ణ ఈ సినిమాని సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

First Published:  27 Feb 2019 12:05 AM GMT
Next Story