Telugu Global
NEWS

చంద్రబాబు ముందే బూతులు తిడుతూ వెళ్లిపోయిన ఎమ్మెల్యే

ప్రకాశం జిల్లా కనిగిరి టీడీపీలో చిచ్చు రాజుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబురావు, మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఇక్కడ టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. ఈ విషయంపై చర్చించేందుకు చంద్రబాబు వీరిద్దరిని అమరావతికి పిలిపించుకున్నారు. సమావేశం ప్రారంభంలో మీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని బాబురావు, ఉగ్ర నరసింహారెడ్డిలు… చంద్రబాబుతో చెప్పారు. కానీ చంద్రబాబు మాటలు కొత్తగా ఉండడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబురావు హఠాత్తుగా ఎదురుతిరిగారు. ఎమ్మెల్యే టికెట్ మాత్రం తనకే ఇవ్వాలని వ్యాఖ్యానించారు. ఇప్పుడే కదా నా నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పి… అప్పుడే […]

చంద్రబాబు ముందే బూతులు తిడుతూ వెళ్లిపోయిన ఎమ్మెల్యే
X

ప్రకాశం జిల్లా కనిగిరి టీడీపీలో చిచ్చు రాజుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబురావు, మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఇక్కడ టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. ఈ విషయంపై చర్చించేందుకు చంద్రబాబు వీరిద్దరిని అమరావతికి పిలిపించుకున్నారు.

సమావేశం ప్రారంభంలో మీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని బాబురావు, ఉగ్ర నరసింహారెడ్డిలు… చంద్రబాబుతో చెప్పారు. కానీ చంద్రబాబు మాటలు కొత్తగా ఉండడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబురావు హఠాత్తుగా ఎదురుతిరిగారు. ఎమ్మెల్యే టికెట్ మాత్రం తనకే ఇవ్వాలని వ్యాఖ్యానించారు. ఇప్పుడే కదా నా నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పి… అప్పుడే ఇలా మాట్లాడుతున్నావ్
అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయినా సరే కదిరి బాబురావు వెనక్కు తగ్గలేదు. సీఎం మరింత ఆగ్రహించడంతో కదిరి బాబురావు గట్టిగా అరుస్తూ విసురుగా బయటకు వెళ్లిపోయారు. ఆ సమయంలో అక్కడే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే దివిశివరాం ఉన్నారు. వారి సమక్షంలోనే
పార్టీ నేతలను కదిరి బాబురావు బూతులు తిట్టారు. పార్టీ నాయకత్వం తీరును కూడా ప్రశ్నించారు.

దాంతో చంద్రబాబుతో సహా అంతా సైలెంట్ అయిపోయారు. అలా వెంటనే బయటకు వచ్చిన కదిరి బాబురావు వెంటనే ఎమ్మెల్యే బాలకృష్ణకు ఫోన్ చేశారు. తనకు టికెట్ విషయంలో అన్యాయం జరుగుతోందని వాపోయారు.

First Published:  26 Feb 2019 8:56 PM GMT
Next Story