Telugu Global
International

ఇదే అంతిమ యుద్ధం కావొచ్చు- పాక్ మంత్రి ప్రకటన

భారత్- పాకిస్థాన్‌ మధ్య యుద్దవాతావరణం నెలకొంది. సరిహద్దుల్లో యుద్ధమేఘాలు ఆవరించాయి. సరిహద్దు గగనతలంపై  విమానాల రాకను నిషేధించారు. విమానాశ్రయాలను సైన్యం ఆధీనంలోకి తీసుకుంటోంది. పాకిస్థాన్‌ కూడా కీలకమైన ఎయిర్‌పోర్టుల నుంచి జాతీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిషేధించింది. ఈనేపథ్యంలో ఏక్షణంలో ఏమైనా జరగవచ్చన్న భావన వ్యక్తమవుతోంది. ఇందుకు తగ్గట్టుగానే పాక్ నుంచి ప్రకటనలు వస్తున్నాయి. ఇదే భారత్-పాకిస్థాన్ మధ్య అంతిమ యుద్ధం కావొచ్చు అని పాక్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ వ్యాఖ్యానించారు. రానున్న 72 గంటలు చాలా కీలకమైనవి అన్నారు. యుద్ధమా లేక […]

ఇదే అంతిమ యుద్ధం కావొచ్చు- పాక్ మంత్రి ప్రకటన
X

భారత్- పాకిస్థాన్‌ మధ్య యుద్దవాతావరణం నెలకొంది. సరిహద్దుల్లో యుద్ధమేఘాలు ఆవరించాయి. సరిహద్దు గగనతలంపై విమానాల రాకను నిషేధించారు. విమానాశ్రయాలను సైన్యం ఆధీనంలోకి తీసుకుంటోంది.

పాకిస్థాన్‌ కూడా కీలకమైన ఎయిర్‌పోర్టుల నుంచి జాతీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిషేధించింది. ఈనేపథ్యంలో ఏక్షణంలో ఏమైనా జరగవచ్చన్న భావన వ్యక్తమవుతోంది.

ఇందుకు తగ్గట్టుగానే పాక్ నుంచి ప్రకటనలు వస్తున్నాయి. ఇదే భారత్-పాకిస్థాన్ మధ్య అంతిమ యుద్ధం కావొచ్చు అని పాక్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ వ్యాఖ్యానించారు. రానున్న 72 గంటలు చాలా కీలకమైనవి అన్నారు.

యుద్ధమా లేక శాంతి… అన్నది రానున్న 72 గంటల్లో తేలిపోతుందన్నారు. యుద్ధమే వస్తే రెండో ప్రపంచ యుద్ధం కంటే పెద్దదిగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు.

Next Story