Telugu Global
Cinema & Entertainment

గట్టిగా కౌంటర్ ఇచ్చిన రాయ్ లక్ష్మి

తెలుగులో ”వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి” సినిమాను రిలీజ్ కు రెడీ చేసింది లక్ష్మీరాయ్. మార్చి 15న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా ప్రమోషన్ లో ఓవైపు ఆమె బిజీగా ఉంటే, మరోవైపు లక్ష్మీరాయ్ పై వరుసపెట్టి పుకార్లు వస్తున్నాయి. తను గర్భవతి అంటూ వస్తున్న పుకార్లు రాయ్ లక్ష్మిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎఫైర్లు లేదా పెళ్లికి సంబంధించి పుకార్లు వస్తే రాయ్ లక్ష్మీ పెద్దగా పట్టించుకోదు. గతంలో వచ్చిన అలాంటి పుకార్లను లైట్ […]

గట్టిగా కౌంటర్ ఇచ్చిన రాయ్ లక్ష్మి
X

తెలుగులో ”వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి” సినిమాను రిలీజ్ కు రెడీ చేసింది లక్ష్మీరాయ్. మార్చి 15న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా ప్రమోషన్ లో ఓవైపు ఆమె బిజీగా ఉంటే, మరోవైపు లక్ష్మీరాయ్ పై వరుసపెట్టి పుకార్లు వస్తున్నాయి. తను గర్భవతి అంటూ వస్తున్న పుకార్లు రాయ్ లక్ష్మిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

ఎఫైర్లు లేదా పెళ్లికి సంబంధించి పుకార్లు వస్తే రాయ్ లక్ష్మీ పెద్దగా పట్టించుకోదు. గతంలో వచ్చిన అలాంటి పుకార్లను లైట్ తీసుకుంది. మీడియా అడిగినా నవ్వి ఊరుకుంది. కానీ ఈసారి ఏకంగా ప్రెగ్నెంట్ అంటూ గాసిప్స్ రావడంతో ఆమె తట్టుకోలేకపోయింది. సదరు మీడియా సంస్థపై ఆగ్రహం వ్యక్తంచేసింది.

ఎలాంటి సమాచారం లేకుండా ఇలాంటి వార్తలు ఎలా ఇస్తారంటూ మండిపడింది లక్ష్మీరాయ్. మీ వ్యూస్ కోసం గర్భం వచ్చినట్టు రాసేస్తారా, బహుశా ఆ రాసిన వ్యక్తికి తానంటే ఇష్టం లేనట్టుందంటూ వ్యాఖ్యానించింది రాయ్ లక్ష్మి. ఇలాంటి స్టోరీలు రాసేకంటే, తనను అడిగితే మంచి స్టోరీ ఐడియాస్ ఇచ్చేదాన్నంటూ సెటైర్ కూడా వేసింది.

First Published:  27 Feb 2019 6:46 AM GMT
Next Story