Telugu Global
International

లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేలిన పోప్ ముఖ్య సలహాదారుడు

రోమన్ క్యాథలిక్ మిషన్ అధినేత పోప్ ఫ్రాన్సిస్‌కు ముఖ్య సలహాదారు, వాటికన్ కోశాధికారి జార్జ్ పెల్ లైంగిక వేధింపుల కేసులో దోషిగా నిర్థారించబడ్డాడు. ఆస్ట్రేలియాలోని ఒక కోర్టు 22 ఏళ్ల క్రితం జరిగిన ఘటనకు సంబంధించి పెల్ దోషి అని తేల్చింది. గతంలోనే ఇతడు దోషిగా నిరూపించబడినప్పటికీ…. కోర్టు ఉత్తర్వులు రహస్యంగా ఉంచాలంటూ స్టే తెచ్చుకున్నాడు. ఆ స్టే ఎత్తివేయడంతో మంగళవారం ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు బహిర్గతమయ్యాయి. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఉన్న సెయింట్ ప్యాట్రిక్స్ […]

లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేలిన పోప్ ముఖ్య సలహాదారుడు
X

రోమన్ క్యాథలిక్ మిషన్ అధినేత పోప్ ఫ్రాన్సిస్‌కు ముఖ్య సలహాదారు, వాటికన్ కోశాధికారి జార్జ్ పెల్ లైంగిక వేధింపుల కేసులో దోషిగా నిర్థారించబడ్డాడు. ఆస్ట్రేలియాలోని ఒక కోర్టు 22 ఏళ్ల క్రితం జరిగిన ఘటనకు సంబంధించి పెల్ దోషి అని తేల్చింది. గతంలోనే ఇతడు దోషిగా నిరూపించబడినప్పటికీ…. కోర్టు ఉత్తర్వులు రహస్యంగా ఉంచాలంటూ స్టే తెచ్చుకున్నాడు. ఆ స్టే ఎత్తివేయడంతో మంగళవారం ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు బహిర్గతమయ్యాయి.

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఉన్న సెయింట్ ప్యాట్రిక్స్ కెథిడ్రల్ ఆర్చ్ బిషప్‌గా జార్జ్ పెల్ పని చేస్తున్న సమయంలో చర్చిలోని కోయర్ (పాటలు పాడే బృందం) సభ్యుల్లో ఇద్దరు 13 ఏళ్ల లోపు బాలురిపై లైంగిక దాడికి పాల్పడ్డట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై సుదీర్ఘంగా జరిగిన విచారణ అతడు దోషే అని తేల్చింది. అతడిపై 5 కేసులు నమోదు అయ్యాయి.

తనపై నమోదు అయిన ఐదు కేసుల్లో నేను నిర్థోషినని.. ఇవన్నీ తప్పుడు ఆరోపణలని పెల్ కోర్టులో వేడుకున్నాడు. కాని విక్టోరియా కోర్టు జ్యూరీ అతను దోషి అని డిసెంబర్ 11న తేల్చింది. విచారణ జరుగుతున్న సమయంలోనే ఇద్దరు బాధితుల్లో ఒకరు 2014లో మరణించారు. నిన్న కోర్టు తీర్పు అనంతరం పెల్ కోర్టు హాల్ నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడకుండానే కారులో వెళ్లిపోయారు.

పెల్ కోర్టు నుంచి బయటకు వస్తున్న సమయంలో బాధితుల్లో ఒకరైన మైఖేల్ (అతడి అసలు పేరును కోర్టు వెల్లడించలేదు) ‘నరకంలో తగలబడు’ అంటూ బిగ్గరగా కేకలు వేశాడు. 2017లో ఈ కేసు విచారణ ప్రారంభమైన సమయంలో పెల్ వాటికన్ నుంచి ఆస్ట్రేలియా తిరిగి వచ్చాడు. కాని ఆస్ట్రేలియా చర్చి నాయకులు పెల్‌పై పలు ఆంక్షలు విధించారు. అంతే కాకుండా అతడిని క్యాథలిక్ చర్చి నుంచి బహిష్కరించారు.

ఇక, ఈ తీర్పుపై పెల్ తరపు న్యాయవాదులు మాట్లాడుతూ.. పెల్ నిర్థోషిత్వాన్ని నిరూపించడానికి చివరి వరకు పోరాడతామన్నారు. మరోవైపు పోప్ ఈ విషయంపై మాట్లాడటానికి నిరాకరించారు. కాని ప్రపంచవ్యాప్తంగా చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులను ఆపడానికి చర్చ్ తన వంతు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇక వాటికన్ సిటీ ఆర్థిక మంత్రిగా ఉన్న పెల్ పదవీ కాలం ఫిబ్రవరి 24న ముగిసింది. అతడిని ఇప్పటికే పోప్ ఫ్రాన్సిస్ తన బృందం నుంచి తొలగించారు. మంత్రి పదవి కూడా పొడిగింపు లేనట్లే అని తెలుస్తోంది. ఈ కేసులో పెల్‌కు 10 ఏండ్ల కఠిన కారాగార శిక్ష పడే అవకాశం ఉంది.

First Published:  27 Feb 2019 11:00 AM GMT
Next Story