Telugu Global
Cinema & Entertainment

బోయపాటితో సినిమా..... వెనక్కి తగ్గిన సంస్థ

ఒక్క సినిమా ఫేట్ ఒక డైరెక్టర్ కెరీర్ గ్రాఫ్ ని పూర్తిగా తలకిందులు చేస్తుంది. ఇప్పుడు బోయపాటి శ్రీను కెరీర్ గ్రాఫ్ కూడా అలాగే పడిపోయింది. అవును “వినయ విధేయ రామ” లాంటి సినిమా తెరకెక్కించి డైరెక్టర్ గా తన గ్రాఫ్ ని కోల్పోయాడు బోయపాటి శ్రీను. ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంలో బోయపాటి శ్రీను పాత్ర చాలా కీలకం అని ఇండస్ట్రీ వారు అలాగే ప్రేక్షకులు కూడా చాలా గట్టిగా నమ్ముతున్నారు. ఇక ఇప్పుడు ఈ […]

బోయపాటితో సినిమా..... వెనక్కి తగ్గిన సంస్థ
X

ఒక్క సినిమా ఫేట్ ఒక డైరెక్టర్ కెరీర్ గ్రాఫ్ ని పూర్తిగా తలకిందులు చేస్తుంది. ఇప్పుడు బోయపాటి శ్రీను కెరీర్ గ్రాఫ్ కూడా అలాగే పడిపోయింది.

అవును “వినయ విధేయ రామ” లాంటి సినిమా తెరకెక్కించి డైరెక్టర్ గా తన గ్రాఫ్ ని కోల్పోయాడు బోయపాటి శ్రీను. ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంలో బోయపాటి శ్రీను పాత్ర చాలా కీలకం అని ఇండస్ట్రీ వారు అలాగే ప్రేక్షకులు కూడా చాలా గట్టిగా నమ్ముతున్నారు.

ఇక ఇప్పుడు ఈ రేంజ్ ఫ్లాప్ చూసిన తరువాత బోయపాటి తో గతంలో సినిమాలకు ఓకే చెప్పిన నిర్మాతలు ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ లని రద్దు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ముందు వరుసలో ఉంది మైత్రి మూవీ మేకర్స్ సంస్థ.

మైత్రి మూవీ మేకర్స్ వారు ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తలో బోయపాటి శ్రీను కి కొంత డబ్బును అడ్వాన్స్ గా ముట్టజెప్పింది. కానీ ఇప్పుడు ఈ ఫ్లాప్ చూశాక బోయపాటి శ్రీను తో సినిమా చెయ్యడం సాహసమే అని గ్రహించి బోయపాటి కి ఇచ్చిన అడ్వాన్స్ వెనక్కి ఇవ్వమని కోరిందట. ముందు దీనికి అంగీకరించని బోయపాటి శ్రీను ….. ఆ తరువాత మైత్రి మూవీ మేకర్స్ వారికి తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసాడడ. ప్రస్తుతానికి బోయపాటి శ్రీను చేతిలో బాలక్రిష్ణ సినిమా ఒక్కటే ఉంది.

First Published:  27 Feb 2019 12:34 AM GMT
Next Story