Telugu Global
NEWS

ఆమంచి కీలక అనుచరుల వరుస అరెస్ట్

ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలో చేరిన చీరాల ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌పై అధికార పార్టీ ప్రతికార దాడులు మొదలుపెట్టింది. ఇప్పటికే ఆమంచి గన్‌మెన్లను మార్చి కొత్త వారిని పెట్టింది. తనపై నిఘా ఉంచేందుకే కొత్త గన్‌మెన్లను ఉంచారని ఆ మధ్య జిల్లా ఎస్పీని కలిసి ఆమంచి అభ్యంతరం తెలిపారు. ఇప్పుడు ఏకంగా ఆమంచి కీలక అనుచరులను వరుసగా అరెస్ట్ చేస్తున్నారు. 2016లో ఒక కేసుకు సంబంధించి ఇప్పటికే ఆమంచి ముఖ్యఅనుచరులలో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం రాత్రి ఆమంచి వ్యక్తిగత కార్యదర్శి రాంబాబును […]

ఆమంచి కీలక అనుచరుల వరుస అరెస్ట్
X

ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలో చేరిన చీరాల ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌పై అధికార పార్టీ ప్రతికార దాడులు మొదలుపెట్టింది. ఇప్పటికే ఆమంచి గన్‌మెన్లను మార్చి కొత్త వారిని పెట్టింది. తనపై నిఘా ఉంచేందుకే కొత్త గన్‌మెన్లను ఉంచారని ఆ మధ్య జిల్లా ఎస్పీని కలిసి ఆమంచి అభ్యంతరం తెలిపారు.

ఇప్పుడు ఏకంగా ఆమంచి కీలక అనుచరులను వరుసగా అరెస్ట్ చేస్తున్నారు. 2016లో ఒక కేసుకు సంబంధించి ఇప్పటికే ఆమంచి ముఖ్యఅనుచరులలో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం రాత్రి ఆమంచి వ్యక్తిగత కార్యదర్శి
రాంబాబును అరెస్ట్ చేశారు పోలీసులు. నేరుగా స్టేషన్‌కు తరలించకుండా రాత్రంతా వాహనాల్లో తిప్పారు.

బుధవారం తాడేపల్లిలో ఆమంచి వైసీపీలో చేరాల్సి ఉంది. ఇందుకోసం జనసమీకరణ, ఇతర ఏర్పాట్లను ఆమంచి వ్యక్తిగత కార్యదర్శి రాంబాబు చూసుకుంటున్నాడు. ఈ కార్యక్రమాన్ని దెబ్బతీసేందుకే రాంబాబును పోలీసులు హఠాత్తుగా అరెస్ట్
చేసినట్టు భావిస్తున్నారు.

First Published:  26 Feb 2019 8:53 PM GMT
Next Story