Telugu Global
NEWS

“దేశం”లో నూర్ భాషా లకు స్థానం లేదు!

తెలుగుదేశం పార్టీలో మైనారిటీలకు అవకాశాలే లేకుండా పోయాయని, వారిని కేవలం ఓట్ బ్యాంక్ గానే చూస్తున్నారని ముస్లిం మైనారిటీ నాయకుడు, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగూర్ మీరా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం హయాంలో నూర్ భాషా లకు, దూదేకులకు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయిందని ఆయన మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ మైనారిటీలకు ముఖ్యంగా దూదేకుల, నూర్ భాషా లకు ఎలాంటి మేలు చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ […]

“దేశం”లో నూర్ భాషా లకు స్థానం లేదు!
X

తెలుగుదేశం పార్టీలో మైనారిటీలకు అవకాశాలే లేకుండా పోయాయని, వారిని కేవలం ఓట్ బ్యాంక్ గానే చూస్తున్నారని ముస్లిం మైనారిటీ నాయకుడు, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగూర్ మీరా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తెలుగుదేశం హయాంలో నూర్ భాషా లకు, దూదేకులకు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయిందని ఆయన మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ మైనారిటీలకు ముఖ్యంగా దూదేకుల, నూర్ భాషా లకు ఎలాంటి మేలు చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలో చేరిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పై నాగుల్ మీరా పరోక్షంగా విరుచుకుపడ్డారు. రానున్న ఎన్నికల్లో జలీల్ ఖాన్ స్థానంలో ఆయన కుమార్తె తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రకటించినప్పటి నుంచి నాగుల్ మీరా మండిపడుతున్నారు.

పదవుల కోసం పార్టీలో చేరిన జలీల్ ఖాన్ కు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు తెలియవని, మరో పార్టీ నుంచి ఆయన దిగుమతి అయిన నాయకుడని విమర్శించారు.

జలీల్ ఖాన్ స్థానంలో తనకు టికెట్ ఇస్తారని ఆశించిన నాగుల్ మీరా టికెట్ రాదని తెలిసి అసంతృప్తికి లోనయ్యారు. దీంతో విజయవాడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లారు. చంద్రబాబు తో మాట్లాడిన అనంతరం కాస్త మెత్తబడినట్లు కనిపించినా 24 గంటలు తిరక్కముందే నాగుల్ మీరా తన అసంతృప్తిని వెళ్లగక్కారు.

మైనారిటీలకు కేటాయిస్తున్న ఐదు స్థానాలలో దూదేకుల, నూర్ భాషలకు చెందిన వారికి కూడా కనీసం రెండు సీట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

అయితే తెలుగుదేశం పార్టీలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి తప్ప ఎన్నాళ్ల నుంచో పార్టీ కోసం కష్టపడుతున్న వారికి మాత్రం పదవులు దక్కడం లేదని తన సన్నిహితుల వద్ద నాగుల్ మీరా ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న నాగుల్ మీరా పార్టీ మారే అవకాశాలను కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

First Published:  25 Feb 2019 9:02 PM GMT
Next Story