Telugu Global
NEWS

టీడీపీ కుల రాజకీయాలపై విచారణకు సిద్ధమా?

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు సాగిస్తున్న పాలనపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహరావు ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో నడుస్తున్నంత దారుణమైన కుల రాజకీయాలను గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో పదవులు, నిధులు అన్నీ తన సొంత సామాజిక వర్గానికే దోచిపెడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో జీవీఎల్ స్పందించారు. చంద్రబాబు కుల రాజకీయాలు చూస్తుంటే కులం పేరుతోనే ఎన్నికలకు వెళ్లేలా ఉన్నారన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న కుల రాజకీయాల పైనా, ఆ పార్టీ ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలపైనా చంద్రబాబు విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు. […]

టీడీపీ కుల రాజకీయాలపై విచారణకు సిద్ధమా?
X

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు సాగిస్తున్న పాలనపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహరావు ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో నడుస్తున్నంత దారుణమైన కుల రాజకీయాలను గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. చంద్రబాబు
ప్రభుత్వంలో పదవులు, నిధులు అన్నీ తన సొంత సామాజిక వర్గానికే దోచిపెడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో జీవీఎల్ స్పందించారు.

చంద్రబాబు కుల రాజకీయాలు చూస్తుంటే కులం పేరుతోనే ఎన్నికలకు వెళ్లేలా ఉన్నారన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న కుల రాజకీయాల పైనా, ఆ పార్టీ ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలపైనా చంద్రబాబు విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు.

దేశంలో ఎక్కడా ఇలా కుల రాజకీయం నడవడం లేదన్నారు. ఏ తప్పు చేయనప్పుడు పదేపదే చంద్రబాబు ఎందుకు సీబీఐ, ఈడీ అంటూ మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబుకు ఈడీ, సీబీఐ శాఖలను తలుచుకోందే రోజు గడవడం
లేదన్నారు.

First Published:  25 Feb 2019 8:33 PM GMT
Next Story