Telugu Global
Cinema & Entertainment

"గ్యాంగ్ లీడర్" లో ప్రియాంక జవల్కర్ ?

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం “జెర్సీ” సినిమా తో బిజీగా బిజీగా ఉన్నాడు. దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ మొదటి వారంలో రిలీజ్ కాబోతుంది. క్రికెట్ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమాని గౌతం డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండగానే నాని విక్రం కే కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. నాని పుట్టిన రోజు సందర్బంగా ఈ సినిమా థీమ్ ఎలా ఉండబోతుంది […]

గ్యాంగ్ లీడర్ లో ప్రియాంక జవల్కర్ ?
X

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం “జెర్సీ” సినిమా తో బిజీగా బిజీగా ఉన్నాడు. దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ మొదటి వారంలో రిలీజ్ కాబోతుంది. క్రికెట్ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమాని గౌతం డైరెక్ట్ చేస్తున్నాడు.

ఇక ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండగానే నాని విక్రం కే కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. నాని పుట్టిన రోజు సందర్బంగా ఈ సినిమా థీమ్ ఎలా ఉండబోతుంది అనే వీడియో రిలీజ్ చేసి దాంట్లోనే సినిమా టైటిల్ ని రివీల్ చేసారు.

“గ్యాంగ్ లీడర్” అని టైటిల్ పెట్టుకున్న ఈ సినిమాలో నాని ఐదుగురు అమ్మాయిలకి గ్యాంగ్ లీడర్ గా ఉంటాడట. ప్రస్తుతం హీరోయిన్స్ కోసం వేట కొనసాగిస్తున్న విక్రం కే కుమార్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర కోసం “టాక్సీ వాలా” ఫేం ప్రియాంక జవల్కర్ ని హీరోయిన్ గా తీసుకోనున్నాడట. ఇటీవలే ఆమె పై ఆడిషన్ కూడా చేశాడట విక్రం కే కుమార్. మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.

First Published:  26 Feb 2019 5:05 AM GMT
Next Story