Telugu Global
Cinema & Entertainment

దేవరకొండ హీరోయిన్ తో రొమాన్స్ చేయబోతున్న అఖిల్ !

“అఖిల్” సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఆ సినిమాతో చేదు అనుభవాన్ని చవిచూశాడు. ఆ సినిమా తరువాత చేసిన “హలో” సినిమా కూడా అఖిల్ కి హిట్ ని ఇవ్వలేకపోయింది. ఇక మొన్న వచ్చిన “మిస్టర్ మజ్ను” కూడా అఖిల్ కి గట్టి ఫ్లాప్ నే తెచ్చిపెట్టింది. ఇలాంటి సమయంలో అఖిల్ స్టార్ ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ నిర్మాతగా గీత ఆర్ట్స్ లాంటి పెద్ద బ్యానర్ లో ఒక సినిమా […]

దేవరకొండ హీరోయిన్ తో రొమాన్స్ చేయబోతున్న అఖిల్ !
X

“అఖిల్” సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఆ సినిమాతో చేదు అనుభవాన్ని చవిచూశాడు. ఆ సినిమా తరువాత చేసిన “హలో” సినిమా కూడా అఖిల్ కి హిట్ ని ఇవ్వలేకపోయింది. ఇక మొన్న వచ్చిన “మిస్టర్ మజ్ను” కూడా అఖిల్ కి గట్టి ఫ్లాప్ నే తెచ్చిపెట్టింది.

ఇలాంటి సమయంలో అఖిల్ స్టార్ ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ నిర్మాతగా గీత ఆర్ట్స్ లాంటి పెద్ద బ్యానర్ లో ఒక సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. అయితే ఈ సినిమాకి దర్శకుడిగా “బొమ్మరిల్లు” భాస్కర్ ని సెట్ చేసాడు అల్లు అరవింద్. ప్రస్తుతం అల్లు అరవింద్ దగ్గరుండి స్క్రిప్ట్ పనులు అన్నీ చూసుకుంటున్నాడట.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా “టాక్సీ వాలా” ఫేం ప్రియాంక జవల్కర్ ని పెట్టాలి అని అల్లు అరవింద్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అఖిల్ కూడా ప్రియాంక జవల్కర్ తో రొమాన్స్ చేయడానికి ఓకే చెప్పాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న ఈ సినిమా పై అధికారిక ప్రకటన త్వరలో రానుంది.

First Published:  26 Feb 2019 2:11 AM GMT
Next Story