Telugu Global
Cinema & Entertainment

"సై రా" లో నిహారిక పాత్ర ఇదేనట!

మెగా పవర్ స్టార్ చిరంజీవి 151 వ సినిమాగా “సై రా నరసింహారెడ్డి” రాబోతోంది. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, కిచ్చ సుదీప్ వంటి హేమ హేమీలు నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఒక పాత్రలో మెగా డాటర్ నిహారిక కొణిదెల కూడా నటించబోతుందనే టాక్ ఇది వరకే వచ్చింది. అయితే ఈ సినిమాలో ఒక గిరిజన యువతిగా నిహారిక కొణిదెల నటించబోతుంది. ఆపద సమయంలో […]

సై రా లో నిహారిక పాత్ర ఇదేనట!
X

మెగా పవర్ స్టార్ చిరంజీవి 151 వ సినిమాగా “సై రా నరసింహారెడ్డి” రాబోతోంది. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, కిచ్చ సుదీప్ వంటి హేమ హేమీలు నటిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో ఒక పాత్రలో మెగా డాటర్ నిహారిక కొణిదెల కూడా నటించబోతుందనే టాక్ ఇది వరకే వచ్చింది. అయితే ఈ సినిమాలో ఒక గిరిజన యువతిగా నిహారిక కొణిదెల నటించబోతుంది. ఆపద సమయంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ఆశ్రయం కల్పించే ఓ గిరిజన యువతి పాత్రలో కనిపించబోతోందట.

ఈ పాత్ర తాలూకు నిడివి చాలా తక్కువే అయినా కూడా ఇలాంటి ప్రతిష్ఠాత్మక చిత్రంలో తాను కూడా ఓ చిన్న భాగమైనందుకు నిహారిక చాలా సంతోషంగా ఉందట.

కొణిదెల ప్రొడక్షన్స్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా దసరా టైం కి థియేటర్స్ లో సందడి చేయబోతుంది. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.

First Published:  26 Feb 2019 2:22 AM GMT
Next Story