Telugu Global
NEWS

హైకోర్టును ఆశ్రయించిన హైకోర్టు న్యాయమూర్తి

మన దేశంలో ప్రభుత్వ కార్యాలయాల పనితీరుకు నిదర్శనం ఈ సంఘటన. ఏళ్ల తరబడి తాను వరుసగా దరఖాస్తులు పెడుతున్నా ప్రభుత్వ యంత్రాంగం స్పందించకపోవడంతో హైకోర్టు న్యాయమూర్తి బులుసు శివశంకర్‌ రావు తానే హైకోర్టును ఆశ్రయించారు. తన పుట్టిన రోజు తేది రికార్డుల్లో తప్పుగా ఉందని దాన్ని సరిచేయాలని రెండు దశాబ్దాలుగా తాను ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరుతూ వస్తున్నానని శివశంకర్‌రావు వెల్లడించారు. తాను వాస్తవానికి పుట్టింది 1959 మార్చి 29న అని…. కానీ రికార్డుల్లో మాత్రం 1957 ఏప్రిల్ 4న 10 పుట్టినట్టుగా ఉందని తన పిటిషన్‌లో […]

హైకోర్టును ఆశ్రయించిన హైకోర్టు న్యాయమూర్తి
X

మన దేశంలో ప్రభుత్వ కార్యాలయాల పనితీరుకు నిదర్శనం ఈ సంఘటన. ఏళ్ల తరబడి తాను వరుసగా దరఖాస్తులు పెడుతున్నా ప్రభుత్వ యంత్రాంగం స్పందించకపోవడంతో హైకోర్టు న్యాయమూర్తి బులుసు శివశంకర్‌ రావు తానే హైకోర్టును
ఆశ్రయించారు.

తన పుట్టిన రోజు తేది రికార్డుల్లో తప్పుగా ఉందని దాన్ని సరిచేయాలని రెండు దశాబ్దాలుగా తాను ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరుతూ వస్తున్నానని శివశంకర్‌రావు వెల్లడించారు. తాను వాస్తవానికి పుట్టింది 1959 మార్చి 29న అని…. కానీ రికార్డుల్లో మాత్రం 1957 ఏప్రిల్ 4న 10 పుట్టినట్టుగా ఉందని తన పిటిషన్‌లో న్యాయమూర్తి వెల్లడించారు. దాన్ని సరిచేయాల్సిందిగా రెండు దశాబ్దాలుగా అధికారులకు విజ్ఞప్తి చేస్తూ వచ్చానన్నారు.

1996లో తొలిసారి వినతిపత్రం ఇచ్చానని… హైకోర్టుకు న్యాయమూర్తిగా వచ్చిన తర్వాత కూడా మరోసారి విజ్ఞప్తి చేశానని కానీ ఇప్పటికీ పని కాలేదన్నారు. రాష్ట్రపతి సచివాలయానికి సైతం వినతిపత్రం ఇచ్చినా పని కాలేదని పిటిషన్‌లో వివరించారు.

ఇక తనకు మరోదారి లేక న్యాయం కోసం హైకోర్టులో పిటిషన్‌ వేశానని చెప్పారు. ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా రాష్ట్రపతి కార్యాలయ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిని చేర్చారు. వ్యవస్థలో పాతుకుపోయిన జడత్వంపై ఇలా ఒక హైకోర్టు న్యాయమూర్తే హైకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశమైంది.

First Published:  25 Feb 2019 8:20 PM GMT
Next Story